Central Minister on YCP: త్వరలోనే జైలుకు పోతావ్.. వైసీపీ సీనియర్ నేతకి కేంద్ర మంత్రి వార్నింగ్!
Central Minister on YCP ( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Central Minister on YCP: త్వరలోనే జైలుకు పోతావ్.. వైసీపీ సీనియర్ నేతకి కేంద్ర మంత్రి వార్నింగ్!

Central Minister on YCP:  కూటమి నేతలను నరుకుతానంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. కారుమూరి, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ కారుమూరి తణుకు మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొడతారని భావించి దూకుడుగా ప్రవర్తిస్తే ఎలా? నరికేస్తాం, చంపేస్తాం అని మాట్లాడితే ఆ నాలుకనే కోస్తాం. టీడీఆర్ బాండ్ల విషయంలో కారుమూరి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు.

Also Read:  UPI Down: దేశంలో నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే చెల్లింపులు.. ఎందుకంటే?

అతి త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురవుతుంది. కారుమూరి నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. నీకు కాళ్లు చేతులు లేకుండా నరకడానికి కత్తిపట్టే అవకాశం రాకుండా మేం ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి నేతలకు సంస్కారం లేదు. గత ప్రభుత్వంలో అవినీతికి మారుపేరు కారుమూరి ఎర్రిపప్ప. కూటమి నేతలంతా సమన్వయంతో వెళ్ళాలని అనుకుంటున్నాం. మాకు సంస్కారం ఉంది, వైసీపీకి సంస్కారం లేదు. కారుమూరి జైలుకెళ్ళి చిప్ప కూడు తినటం ఖాయం. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి. మమల్ని రెచ్చగొడితే కాళ్లు చేతులు నరికేస్తాం. ప్రజలు శిక్ష విధించారు భరించండి’ అని కేంద్ర మంత్రి హితవు పలికారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?