Phone Tapping This is just a trailer, Picture Abhi Baaki Hai
క్రైమ్

Phone Tapping: ట్యాపింగ్ లీలలు.. స్త్రీ నిధి విద్యాసాగర్‌పై అనుమానాలు

– స్త్రీ నిధి గ్రూపులోని మహిళలే టార్గెట్
– నాలుగు లక్షల సిమ్ కార్డులను అందించి నిఘా
– వ్యక్తిగత జీవితాల్లో చొరబడిన స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి
– గత ప్రభుత్వం ఉపయోగించుకుందంటూ అనుమానాలు
– జాతీయ మహిళా కమిషన్‌కు బక్క జడ్సన్ ఫిర్యాదు

Srinidhi Groups: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతున్నది. తొలుత రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగిందని దర్యాప్తులో తేలింది. కానీ, ఆ తర్వాత అక్రమ వసూళ్లకు, సెటిల్‌మెంట్లకు, బెదిరింపులకు ఫోన్ ట్యాపింగ్‌ను ఉపయోగించారని బయటపడింది. ఆ తర్వాత ఓ కానిస్టేబుల్ ఏకంగా పదుల సంఖ్యలో మహిళలను వేధించాడని వార్తలు వచ్చాయి. మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, వారి ఫోన్లు ట్యాప్ చేసి గోప్యత హక్కును భంగపరిచి, వ్యక్తిగత జీవితాల్లో చిచ్చుబెట్టారని ఆరోపణలు వచ్చాయి.

Also Read: KTR : మేము ఎన్నో చేశాం!

తాజాగా, మహిళా సంఘాల సభ్యులు కూడా ఫోన్ ట్యాపింగ్‌ బాధితులేనని తెలంగాణ వనరుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బక్క జడ్సన్ అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కూలి పనులు చేసుకుని, పదో పరకో సంపాదించుకునే మహిళలు సంఘాలుగా ఏర్పడి డబ్బులు పొదుపు చేసుకుంటారు. స్త్రీ నిధి ద్వారా రుణాలు పొందుతూ తిరిగి చెల్లిస్తూ ఉంటారు. తమ పురోగతికి స్త్రీ నిధి రుణ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు. కానీ, ఈ మహిళల వ్యక్తిగత జీవితాలనూ అగౌరవపరిచారని, వారి పర్సనల్ లైఫ్‌లో స్వేచ్ఛ లేకుండా చేశారని బక్క జడ్సన్ ఆరోపణలు చేస్తున్నారు.

సుమారు నాలుగు లక్షల సిమ్ కార్డులను కొనుగోలు చేసి మహిళలకు చేరవేశారని, వారి విషయాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని ఆ మహిళల వ్యక్తిగత జీవితాలను నరకప్రాయం చేశారని పేర్కొన్నారు. స్త్రీ నిధి ఎండీ జీ విద్యాసాగర్ ఫోన్ ట్యాపింగ్‌ చేయడాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకుందని బక్క జడ్సన్ ఆరోపించారు. పలు సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాల సభ్యులపైనా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా వేసిందని తెలిపారు. ఎన్నో కార్యక్రమాలను ట్యాపింగ్ ద్వారా వింటూ అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. వీటంతటికీ జీవం పోసింది స్త్రీ నిధి ఎండీ జీ విద్యాసాగర్ రెడ్డేనని పేర్కొన్నారు. ఈ అంశంపై తాను పలు సందర్భాల్లో ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జాతీయ మహిళా కమిషన్‌ను బక్క జడ్సన్ కోరారు.

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!