Hyderabad Crime (imagecredit:canva)
క్రైమ్

Hyderabad Crime: మరో 3 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణ హత్య.. అదే కారణమా?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Crime: పాతబస్తీలో రౌడీషీటర్​ ను దారుణంగా హత్య చేశారు. మరో మూడు రోజుల్లో అతని పెళ్లి జరుగనుండగా ఈ హత్య జరగటం గమనార్హం. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పలు క్రిమినల్​ కేసుల్లో నిందితునిగా ఉన్న ఫలక్​ నుమా ప్రాంత నివాసి మహ్మద్​ మసియుద్దీన్​ (27) పై ఫలక్ నుమా పోలీస్​ స్టేషన్​ లో రౌడీషీట్​ నమోదై ఉంది. కాగా, ఇటీవలే మసియుద్దీన్​ కు పెళ్లి ఖాయమైంది. ఈనెల 17న ముహూర్తం ఉండటంతో కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇక, తన పెళ్లి కార్డులను బంధువులకు పంచుతున్న మసియుద్దీన్ తెల్లవారుజామున రెయిన్​ బజార్​ లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి తన థార్​ కారులో వెళ్లాడు. అయితే, రెండు బైక్​ లపై వచ్చిన అయిదుగురు దుండగులు అతన్ని డబీర్​ పురా ఫ్లై ఓవర్​ బ్రిడ్జీ వద్ద అడ్డుకున్నారు. ఆ వెంటనే కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ మసియుద్దీన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వెంటనే దుండుగులు అక్కడి నుంచి వచ్చిన బైక్​ లపై పారిపోయారు. విషయం తెలియగానే రెయిన్​ బజార్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తర​లించారు.

ఆ గొడవే కారణమా…?

పోలీసుల విచారణలో మసియుద్దీన్ గతనెల 23 న మహ్మద్​ షేర్, ఆసిఫ్​, ఉమర్​ అనే వ్యక్తులతో గొడవ పడినట్టు తెలిసింది. ఈ ఘర్షణలో మీ అందరినీ చంపేస్తా అంటూ మసియుద్దీన్ బెదిరించినట్టుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో మహ్మద్​ షేర్, ఆసిఫ్​, ఉమర్​ లు తమ సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తున్నారు. ఈ హత్యకు పాల్పడ్డ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కేసు దర్యాప్తు చేస్తున్న రెయిన్​ బజార్​ పోలీసులు తెలిపారు.

Also Read: Case Against Aghori: లేడీ అఘోరీ ఆ పూజ చేస్తోందా? మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు..

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..