ys jagan (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

ABV Rao: వైఎస్ జగన్ గురించి చెప్పండి.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రకటన..

ABV Rao: మీకు మాజీ సీఎం జగన్ గురించి చెప్పాలని ఉందా? అయితే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేస్తే సరి. ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరో మాజీ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఇటీవల తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించిన ఈయన, తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ఇంతకు ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే..

ఏబీ వెంకటేశ్వరరావు అంటే తెలియని వారుండరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయన స్వరం అలా ఇలా కాదు, ధిక్కార స్వరమే వినిపించి వార్తల్లో కనిపించారు. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించి, రిటైర్మెంట్ రోజే భాద్యతలు చేపట్టడం విశేషం. ఇలా వైసీపీ హయాంలో ఏబీ వేంకటేశ్వరరావు పేరు మారుమ్రోగేది. పదవీ విరమణ తర్వాత ఈయన రాజకీయ రంగప్రవేశం ఖాయమని అందరూ భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి ఏబీ సోషల్ మీడియా ద్వారా జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అసలు విషయం చెప్పకనే చెప్పారు ఈయన.

తాను రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి ఎప్పటికైనా రావడం అవసరం అనిపించిందని, అందుకే నేటి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నానని, అంతేకానీ పదవులు ఆశించి మాత్రం కాదని వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు ఏబీ వెంకటేశ్వర్లు. అయితే జగన్ అక్రమాలను మాత్రం కచ్చితంగా బయటకు తెస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జగన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు తెస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో కోడికత్తి శ్రీను లాంటి జగన్ బాధితులు వందలు, వేలల్లో ఉన్నారు. వాళ్లందరికీ నా వంతు సహాయం చేసి వారి కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు ప్రయత్నిస్తా. జగన్ ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలను అందరి సహాయంతో బయటపెడతా. నా ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నా. నేను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. జగన్ గురించి ఏం చెప్పాలనుకున్నా 7816020048 వాట్సాప్ నంబర్‌కి సమాచారం పంపొచ్చని కోరారు.

వందల కోట్లు ఎక్కడ?
సండూర్ పవర్‌తో మొదలైన జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం నేడు లక్షల కోట్లకు చేరిందని ఏబీ ఆరోపించారు. రూ.25 కోట్లతో జగన్ కొన్న సెకండ్ హ్యాండ్ సండూర్ పవర్‌లోకి వందల కోట్ల అనుమానాస్పద నగదు విదేశాల నుంచి వచ్చిందని విమర్శించారు. ఆ డబ్బంతా ప్రజలదే.. జగన్ కష్టపడి సంపాదించింది కాదన్నారు.

Also Read: Visakhapatnam Crime: 8 నెలల గర్భిణీ మహిళను చంపిన భర్త.. విశాఖలో దారుణం..

జగన్, అతని అనుచరులు దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కేలా పోరాటం చేయాలన్నారు. జగన్ అక్రమాస్తులపై కేసులన్నీ లాజికల్ కంక్లూషన్‍కి రావాలని, తనకు జగన్‍కు ఉన్న వివాదాల ఎకౌంటు క్లోజ్ అయిపోయిందన్నారు. జగన్ చేయాల్సింది చేశారు.. నేను చేయాల్సిన పోరాటం నేను చేశా. ఇక ఇది కొత్త అధ్యాయమని ఏబీ చెప్పారు. అయితే ఈయన టీడీపీలో చేరుతారన్న టాక్ వినిపిస్తోంది.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్