Karnataka Crime: ఇటీవలే చిన్న పిల్లల పై ఎన్నో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. పసి పిల్లలు అని కూడా చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. అమ్మాయి నడి రోడ్డు మీద కనిపిస్తే చాలు మాయ మాటలు చెప్పి వారిని ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇక చిన్న పిల్లలకైతే చాక్లెట్స్ ఆశ చూసి ఎవరూ లేని సమయంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో ఎన్నో హత్యాచారాలు జరిగాయి. వాటిలో కొన్నింటి జాడ కూడా లేదు. రోజు రోజుకు ఈ బాధితుల లిస్ట్ పెరిగిపోతోంది. తాజాగా, కర్ణాటక రాష్ట్రంలో దారుణమైన ఘటన జరిగింది.
కర్ణాటక రాష్ట్రం లోని హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ చేసి హత్య చేసిన వ్యక్తి ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించి అతడ్ని పట్టుకున్నారు. అయితే, ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Anna Konidela: పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన అన్నా.. ఫొటోలు వైరల్
హుబ్బళ్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారికి మాయ మాటలు చెప్పి నిందితుడు ఎత్తుకెళ్లాడు. పాప కోసం కుటుంబ సభ్యులు గాలించగా.. ఎంతకీ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. చుట్టూ పక్కల అన్నీ వెతకగా ఓ భవనంలోని బాత్‌రూంలో కనిపించింది. వెంటనే, ఆమెను హాస్పిటల్ కి తరలించగా.. ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. చిన్నారిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడిన తర్వాత వెంటనే ఆమె హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని, అతడ్ని తరలిస్తుండగా.. ఎదురు దాడికి దిగాడు. పారిపోతున్న సమయంలో పోలీసులు హెచ్చరికగా కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే అతడు ఓ పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశాడు. పరిస్థితులు అదుపు తప్పడంతో ఓ పోలీసు అధికారి గాల్లోకి కాల్పులు జరిపారు.. అయినా కూడా అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో, నిందితుడిపై మరో రెండు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వెంటనే, అతడ్ని ఆస్పత్రికి తరలించామని.. కానీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారని పోలీసులు వెల్లడించారు.
Also Read: Tirumala News: వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి.. తీర్థ స్నానమాచరించిన 14,500పైగా భక్తులు
ఈ ఘటనపై స్పందించిన పలువురు ” ప్రతి అమ్మాయికి ఇలాంటి న్యాయమే జరిగితే దేశంలో హత్యాచారాలు తగ్గుతాయని” పోలీసులను ప్రశంసిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు