Perni Nani: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో గుంటూరు జిల్లాలో 12 మంది పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. ఈ సస్పెండ్ చేసిన విధానాన్ని చూస్తే కూటమి పాలన ఎలా సాగుతోందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలిసులు ఈ చర్యలు గుర్తించాలని సూచించారు.
Also Read: Pastor Praveen’s death: పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త షాకింగ్ నిజాలు.. క్లియర్ కట్ గా చెప్పేశారుగా!
‘ చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులను వాడుకొని వదిలేయడం సర్వసాధారణం. ఎస్సై, సీఐలు ఈ విషయాలన్నీ గమనించాలి. చంద్రబాబు ఎవరినైనా ఎర వేస్తారు, ఎవరినైనా బలిచేస్తారు. అధికారి, బంధువు, పోలీసు, కార్యకర్త ఇలా ఎవరైనా చంద్రబాబుకు ఒకటే. కార్యకర్తను మెప్పించడానికి 12 మందికి పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి? రెడ్ బుక్ చూసో, మంత్రి లోకేష్ మాటలను విని, చంద్రబాబు వెనుకున్నారు కదా? అని ఓవరాక్షన్ చేసే పోలీసులు చాలా మందే ఉన్నారు. దొంగ కేసులు పెట్టడం కొట్టడం తిట్టడం, చేస్తున్నారు.
Also Read: Deccan Cement: డెక్కన్ సిమెంట్ కబ్జా గుర్తుందా? బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్, పర్యావరణవేత్తల ప్రశ్నలు
ఆ పోలీసులంతా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి కొడుకులను, పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుంటే మీకు ఏ గతి పడుతుందో పోలీసుల సస్పెన్షన్‌ను చూస్తే అర్థమవుతుంది. హుందాతనం మర్చిపోయి రెడ్ బుక్ రచయిత లోకేష్‌ను, అడ్రస్ తెలియని పవన్ కళ్యాణ్‌లను చూసుకొని రెచ్చిపోతే తిప్పలు తప్పవు’ అని పోలీసులను పేర్ని నాని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు దోచుకునే పనిలో వారు ఉన్నారని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా దోచుకునే పనిలో ఉన్నారని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు.