Alluri District: సాధారణంగా సెలవులు రాగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. కొందరైతే విహార యాత్రలకు ప్లాన్ చేసుకుని వెళ్తారు. వెళ్లిన ప్రదేశంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా ఊహించలేరు. అలాగే, ఎలా వెళ్ళామో ? అలా తిరిగి వస్తామని గ్యారెంటీ కూడా లేదు. కానీ, ఎంజాయ్ మాత్రం చేయాలనీ ట్రిప్స్ వేస్తుంటారు. అయితే, ఎక్కువగా జలపాతాలు చూడటానికి వెళ్తుంటారు. ఆ సమయంలో జరగరాని ప్రమాదాలు ఏమైనా జరిగితే మనిషే లేకుండా పోతారు. తాజాగా అనంతగిరి మండలంలో అలాంటి విషాదమే చోటు చేసుకుంది. అసలు, ఈ ఘటన ఎలా జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Pastor Praveen’s death: పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త షాకింగ్ నిజాలు.. క్లియర్ కట్ గా చెప్పేశారుగా!
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పంచాయతీ పరిధిలో సరియా జలపాతం వద్ద ఇద్దరు గల్లంతు అవ్వడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన అందర్ని కంట తడి పెట్టిస్తుంది. అనంతగిరి మండలంలో విషాదం చోటు చేసుకుంది. జలపాతాన్ని చూద్దామని వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. మొత్తం ఆరుగురు ఈ విహారయాత్రకు వెళ్లారు. గల్లంతైన వారిలో ఇద్దరు విశాఖపట్నం పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన నరసింహం, వాసుగా గుర్తించారు. జలపాతాలు చూడటానికి వెళ్ళినప్పుడు అదుపుతప్పి జలపాతంలో జారిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జలపాతంలో యువకులు కొట్టుకుపోగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు