khammam crime (imagecredit:swetcha)
క్రైమ్

khammam crime: భర్తను చంపేందుకు సుపారీ.. అడ్వాన్స్ కూడా.. ఎంతంటే!

ఖమ్మం స్వేచ్ఛ: khammam crime: వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర పన్నిన ఘటన ఆదివారం ఖమ్మం లోని ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామంలో తోట ధర్మ అనే వ్యక్తి భార్య తో కలిసి ఉంటున్నాడు.అదే గ్రామానికి చెందిన కొండూరీ రామాంజనేయులు(రాము), ధర్మా భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.విషయం బయటికి రావడంతో భార్య,భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ప్రియురాలి భర్తను అడ్డు తొలగించాలనీ, రాము ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం కు చెందిన దంతాల వెంకట నారాయణ తో కలిసి పథకం పన్నాడు. ఇద్దరూ కలిసి వెంకట్ నారాయణ స్నేహితుడు విజయ్ కుమార్ అనే రౌడీ షీటర్ దగ్గరకు వెళ్ళి, ధర్మా ను హత్య చేయడానికి 20 లక్షలు సుపారీ మాట్లాడి,5లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు.

పథకం ప్రకారం గత నెల 12న తోట ధర్మ ను నిందితులు కిడ్నాప్ చేసి,వీడియో కాల్ ద్వారా రామాంజనేయులు కు చూపించారు.మిగతా డబ్బు చెల్లిస్తే హత్య చేస్తాం అని చెప్పారు.కాల్ కట్ చేసిన రామాంజనేయులు,కిడ్నాపర్లు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.దీంతో విసిగి పోయిన నిందితులు తోట ధర్మా ను బెదిరించి లక్షన్నర డబ్బు,బంగారు గొలుసు తీసుకొని హత్య చేయకుండా వదిలి వెళ్ళారు.

బాధితుడు ధర్మ జరిగిన విషయం పోలీసులకు చెప్పడంతో, ఏసీపీ రమణ మూర్తి పర్యవేక్షణ లో ఆదివారం ఐదుగురు నిందితులను(రాము,వెంకట్ నారాయణ,విజయ్ కుమార్ లతో పాటు మరో ఇద్దరు )అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ తెలిపారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?