Attacked by bear (imagecredit:swetcha)
క్రైమ్

Attacked by bear: యువకునిపై ఎలుగుబంటి దాడి.. ఎక్కడంటే!

హుజురాబాద్ స్వేచ్ఛ: Attacked by bear:  హుజురాబాద్ మండలం లో ని కాట్రపల్లి గ్రామంలో ఆది వారం తెల్లవారు జామున విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కాట్రపల్లి గ్రామానికి చెందిన బాణాల హరీష్, (32) ఉదయం బహిర్భూమికి వెళ్ళగా  ఎలుగుబంటిని గమనించిన హరీష్, సాహసోపేతంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

అయితే ఎలుగుబంటి అతని భుజంపై దాడి చేసి గాయపరిచింది. దాడిని అడ్డుకునే క్రమంలో అతని రెండు చేతి వేళ్ళు ఫ్రాక్చర్ కావడంతో వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల కొన్ని రోజులుగా గ్రామంలో ఎలుగుబంటి సంచారం జరుగుతున్నట్లు గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు రెండు సార్లు సమాచారం అందించినా, వారు తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పిల్లలు బయట ఆడుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంతో ఎలుగుబంటి దాడులకు గురయ్యే ప్రమాదం పెరిగినందున, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఎలుగుబంటిని బంధించి వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అప్పగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Inter Student Suicide: పుట్టిన రోజునే ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?