MP Balram Nayak (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

MP Balram Nayak: మంచి చేస్తే ఓర్వలేక పోతున్నారు.. ఎంపీ బలరాం నాయక్

మహబూబాబాద్ స్వేచ్ఛ: MP Balram Nayak: తెలంగాణ రాష్ట్రంలోని రైతు సంక్షేమమే ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయమని మహబూబాబాద్ ఎంపీ కోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పేర్కొన్నారు. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో నరసింహుల పేట మండలంలోని రామన్నగూడెం, వంతడుపుల గ్రామాల్లో ఐకేపీ సెంటర్ లను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ జాటోతు రాంచందర్ నాయక్ ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన అనతి కాలంలోనే అన్నివర్గాల అభివృద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా ఆదరణను పొందిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీతో పాటు రైతులు పండించిన ధాన్యానికి క్వింటాకు బోనస్ రూ. 500 ఇచ్చిన ఘనత తమదేనన్నారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనను ఓర్వలేని కొంతమంది నాయకులు విషప్రచారం చేస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?