Rajamouli and Mahesh Babu For SSMB29
ఎంటర్‌టైన్మెంట్

SSMB29: ‘బాహుబలి’ తర్వాత మరోసారి రాజమౌళికి ఆ దర్శకుడి సాయం!

SSMB29: ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఏంటి? ఇంకో దర్శకుడి సాయం తీసుకోవడం ఏంటి? అని అనుకుంటున్నారా? రాజమౌళిలో ఉన్న గొప్పతనం ఇదే. ఆయన ఇంటర్వ్యూలో తన కంటే గొప్ప దర్శకుడు సుకుమార్ (Sukumar) అని చెబుతాడు. పూరి జగన్నాధ్‌ (Puri Jagannadh)‌లా భవిష్యత్‌లో సినిమాలు తీయాలని కోరుకుంటూ ఉంటాడు. నిజంగా రాజమౌళి స్థాయి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఎక్స్‌పెక్ట్ చేస్తామా? కానీ, రాజమౌళి ఎవరి ఊహకు అందడు అంతే. ఇప్పుడు కూడా మరోసారి, ఒక టాలెంటెడ్ దర్శకుడి నుంచి, తనకు కావాల్సిన అవుట్‌ఫుట్‌ని రాబట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.

Also Read- Pawan Kalyan: తిరుమలకు పవన్.. ఆ విమర్శలకు చెక్.. ట్రోలర్స్ కు నిద్ర లేనట్లే!

ఇంతకీ ఎవరా టాలెంటెడ్ దర్శకుడు? ఏమా కథ? అని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ‘బాహుబలి’ (Bahubali) వరకు వెళ్లి వద్దాం. కాలకేయ సేన వచ్చి మాహిష్మతి రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించి దాదాపు సక్సెస్ అవుతున్న సందర్భంలో.. ఒక్కసారిగా బాహుబలి నోటి వెంట పిడుగుల్లాంటి డైలాగ్స్ పడతాయి. ఆ డైలాగ్స్ రాసిన రైటర్ ఎవరో తెలుసా? ఇంకెవరు దర్శకుడు దేవా కట్టా. ఈ విషయం స్వయంగా రాజమౌళి చెప్పడమే కాదు.. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లో కూడా ఆ దర్శకుడి పేరును వేశారు.

‘‘నాతో వచ్చేదెవరు..? నాతో చచ్చేదెవరు..?
మరణం.. మరణం.. మహా సేనా..! ఏది మరణం..? మన గుండె ధైర్యం కన్నా శత్రుబలగం పెద్దది అనుకోవటం మరణం.., రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండటం మరణం…’’ అంటూ ఆ యుద్ధ సమయంలో ‘బాహుబలి’ ప్రభాస్ నుంచి వచ్చే పలుకులు సైన్యానికి పున:శక్తిని ఇస్తాయి. ఆ తర్వాత కాలకేయ సైన్యాన్ని, మాహిష్మతి సైన్యం ఎలా మట్టి కరిపిస్తుందో? వెండితెరపై విజువల్ ఫీస్ట్‌లా రాజమౌళి తెరకెక్కించారు. నిజంగా ఆ డైలాగ్స్ ఆ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. దేవా కట్టా (Deva Katta)లోని రైటింగ్ టాలెంట్‌ని గుర్తించిన రాజమౌళి, ఆ బాధ్యతని ఆయనకు అప్పగించారు.

Also Read- Jr NTR: కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోవడం నావల్ల కాలేదు

ఇప్పుడు మరోసారి దేవా కట్టా సాయం తీసుకుంటున్నారు ఎస్.ఎస్. రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘SSMB29’ కోసం దేవా కట్టాను డైలాగ్ రైటర్‌గా రాజమౌళి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకు ముందు రాజమౌళి సినిమాకు బుర్రా సాయిమాధవ్ డైలాగ్ రైటర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. అయితే సందర్భానుసారంగా పడే డైలాగ్స్ రాసే ఛాన్స్‌ని ఆ సందర్భానికి బలంగా డైలాగ్స్ ఎవరు రాయగలరో, వారిని వెతికి మరీ పట్టుకునే శక్తి, సామర్థ్యాలు రాజమౌళి సొంతం. అందుకే సినిమా హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా డైలాగ్స్‌తోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న దేవా కట్టాకు మహేష్ చిత్రం కోసం ఛాన్సిచ్చారు.

Rajamouli and Deva Katta
Rajamouli and Deva Katta

మాములుగా అయితే మహేష్ బాబు చిత్రానికి అంత గొప్పగా డైలాగ్స్ ఏమీ అవసరం లేదు. నార్మల్‌గానే మహేష్ తన స్క్రీన్ ప్రెజన్స్‌తో డైలాగ్స్ కంటే ఎక్కువగా సీన్‌ని రక్తి కట్టిస్తాడు. మరి దేవా కట్టాని డైలాగ్స్ కోసమని తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందో తెలియదు కానీ, ఈ అప్డేట్‌తో ప్రస్తుతం ‘SSMB29’ వరల్డ్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అన్నట్టు దేవా కట్టాకు ఇంగ్లీష్ లిటరేచర్‌పై మాంచి పట్టుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి దృష్టంతా హాలీవుడ్‌పై ఉంది. ఈ కోణంలో ఏమైనా దేవా కట్టాను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడేమో.. ఏమో జక్కన్న చర్యలు ఊహాతీతం మరి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!