Kalyan Ram and Jr NTR
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోవడం నావల్ల కాలేదు

Jr NTR: నందమూరి కళ్యాణ్ రామ్ కొడుకుగా, విజయశాంతి తల్లిగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య వచ్చే సన్నివేశాలు కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయడమే కాకుండా అన్ని ఏరియాల్లో ఈ సినిమా బిజినెస్ పూర్తయ్యేలా చేసింది. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను శనివారం మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

Also Read- Vijayashanti: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌.. రామలక్ష్మణుల్లా చూడముచ్చటగా ఉన్నారు

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా బృందానికి నా నమస్కారాలు. ఈ వేదికపై నేను, అన్న నిలుచున్నప్పుడు నాన్న చాలా సార్లు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈరోజు నాన్న లేని లోటు తీరినట్లయింది. అదెలా అంటే విజయశాంతి అమ్మ మాట్లాడుతుంటే. ఈవెంట్‌లో నాన్న ఉంటే ఎలా ఉండేదో ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ లోటు నాకు భర్తీ అయిపోయింది. చాలామంది గొప్ప సినిమాలు చేసి అద్భుతంగా అలరించారు. కానీ ఆవిడ సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. ‘కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు’ ఇలా ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేశారు. నాకు తెలిసి భారతదేశంలో ఏ నటి ఆమెలాంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు చేయలేదు. ఆ ఘనత ఆవిడ ఒక్కరికే దక్కింది. భారతదేశ చలనచిత్ర పటంలో హీరోలకి సమానంగా నిలుచున్న ఏకైక మహిళ ఆవిడే. ఈ చిత్రం ఆలోచన కూడా కర్తవ్యంలో ఉన్న పాత్రకు ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఆలోచన నుంచే మొదలై ఉంటుందని భావిస్తున్నాను.

Arjun Son Of Vyjayanthi Pre Release Event
Arjun Son Of Vyjayanthi Pre Release Event

ఈ వేడుకకు రావడం అభిమానులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నేను చూశాను. విజయశాంతమ్మ లేకపోతే ఈ సినిమా లేదు. పృథ్వి లేకపోతే, సోహెల్ లేకపోతే ఈ సినిమా లేదు. ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్ కాకపోతే ఈ సినిమా లేదు. సునీల్, అశోక్ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ సినిమా లేదు. ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారు. సినిమా చూసిన నాకు తెలుసు ఈ సినిమాని వాళ్ళు ఎంత నమ్మారో. 18 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. రాసి పెట్టుకోండి. ఆఖరి 20 నిమిషాలు థియేటర్స్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా మలిచారు.

Also Read- Pawan Kalyan: ‘పురుష:’.. ఇండస్ట్రీలోకి మరో పవన్ కళ్యాణ్!

ప్రతిసారి కాలర్ ఎగరేయమని నేను చెప్తుంటాను. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్‌ని నేను ఎగరేస్తున్నాను. సినిమా చూస్తున్నప్పుడు కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోవడం నావల్ల కాలేదు. రేపొద్దున్న మీ అందరికీ అర్థమవుతుంది. ఆ ఆఖరి 20 నిమిషాలు అలా రావడానికి కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. ఆయన ఆ ఆలోచనని నమ్మక పోయి ఉంటే, ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసే వాడిని కాదు. ఆయన నమ్మి డెడికేటెడ్‌గా వర్క్ చేశారు. ఈ సినిమా కళ్యాణ్ అన్న కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. విజయశాంతి అమ్మ అని నమ్మేసి చేశారు. తల్లిగా నమ్మేశారు కాబట్టే అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో సాంకేతిక నిపుణులకు, నటీనటులందరికీ నా అభినందనలు. 18 తారీఖున అందరికీ బ్రహ్మాండమైన సినిమా రాబోతుంది. అభిమానులు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 18న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా రిలీజ్ కాబోతుంది.

Jr NTR Speech
Jr NTR Speech

ఆగస్టు 14న ‘వార్ 2’ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి అభిమాని నాకు చాలా ముఖ్యం. నాన్న ఈ వేదిక మీద ఉన్నప్పుడు ఈ జన్మ అభిమానులకి అంకితం అని చెప్పాను. ఈ జన్మ ఈ జీవితం మీకే అంకితం. త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుసుకుంటాను. కొంచెం ఓర్పు, సహనంతో ఉండండి. నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనానికి మారుపేరు. త్వరలోనే కలుసుకుందాం. సరదాగా మాట్లాడుకుందాం. అందరూ ఏప్రిల్ 18న థియేటర్స్‌లో కలుసుకుందాం. అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు