Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అందరికీ తెలుసు. ప్రస్తుతం ఆయన పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో ఆయన చేస్తున్న సినిమాలన్నీ కన్ఫ్యూజన్‌లో ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ఈ మే లో వస్తుందని చెబుతున్నారు. మరో వైపు ‘ఓజీ’ (OG) కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో చెప్పడానికి సోషల్ మీడియాను ఫాలో అయితే చాలు. ఇక హరీష్ శంకర్‌తో చేయాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి మరిచిపోతే బెటర్. ఎందుకంటే, ఆ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందో హరీష్ శంకర్‌కి కూడా తెలియదు. ఇలా ఉంది పవర్ స్టార్ సినిమాల పరిస్థితి. పవన్ కళ్యాణ్ పేరుతో ఇప్పుడు ఇండస్ట్రీలోకి మరో హీరో అరంగేట్రం చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Vijayashanti: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. రామలక్ష్మణుల్లా చూడముచ్చటగా ఉన్నారు
కామెడీ ప్రధానంగా వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారనే విషయం తెలిసిందే. లాజిక్స్ లేకపోయినా కామెడీ వర్కౌట్ అయితే చాలు, బాక్సాఫీస్ వద్ద అలాంటి సినిమాలు సంచలన విజయాలు నమోదు చేస్తుంటాయి. ఇక ఇలాంటి పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా ‘పురుష:’ (Purushaha) అనే చిత్రం రాబోతోంది. బ్రహ్మచారి, భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం ఒక యుద్ధభూమిగా మారుతుంది అనే లైన్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ మూవీని శనివారం గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభ ముహుర్తానికి వడ్డవల్లి వెంకటేశ్వర రావు(బుల్లబ్బాయ్) క్లాప్ కొట్టారు. బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ‘మళ్లీ రావా, జెర్సీ, మసూధ’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వీరు ఉలవల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తన శిష్యుడి సినిమాకు సపోర్ట్ చేస్తూ సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో, పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Also Read- Anchor Ravi: వ్యూస్ కోసం తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్లీజ్.. ఆ థంబ్స్‌ని నమ్మకండి!
పవన్ కళ్యాణ్ సరసన వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కోషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి.గణేష్ ఇతర ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా హీరో పేరు పవన్ కళ్యాణ్ అని అనౌన్స్ చేయగానే, ఆటోమేటిగ్గా ఈ సినిమా వార్తలలో నిలుస్తుంది. సినిమా అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఈ పేరుతోనే ఈ సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు