Anchor Ravi: తాజాగా బుల్లితెర కోసం రవి, సుధీర్ చేసిన స్కిట్ (Sudigali Sudheer Skit) వివాదంగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ స్కిట్‌ని పోస్ట్ చేసి, హిందూ మత పెద్దలు, వానర సేన వంటి వారంతా సుడిగాలి సుధీర్, యాంకర్ రవిలపై ఫైర్ అవుతున్నారు. ‘హిందూ దేవుళ్లను ఎగతాళి చేసి, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వీళ్లకి పరిపాటి అయిపోయింది. సాక్షాత్తూ ఆ పరమశివుడి వాహనం నందీశ్వరుని కొమ్ముల నుంచి చూస్తే రంభ శివుడిలా కనిపించడం ఏంటి?. ఇంకోసారి ఇలాంటి స్క్రిప్టులు రాయకుండా, చేయకుండా వీళ్లకి తగిన గుణపాఠం నేర్పాలి’ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ వార్నింగ్‌లతో యాంకర్ రవి (Anchor Ravi) ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపాడు. ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని, నేనూ హిందువునే, నాదీ హిందూ మతమే అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయినా కూడా ఆయనపై కాంట్రవర్సీ ఆగడం లేదు. రకరకాల థంబ్స్‌తో ఇంకా ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్న వారిని నమ్మవద్దు అంటూ మరోసారి రవి ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..
Also Read- Mass Jathara: ‘తు మేరా లవర్’.. ఇదేందయ్యా ఇది.. అస్సలు ఊహించలే!
‘‘నేను మీ యాంకర్ రవి. గత రెండు రోజులుగా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. వీడు మార్చేసుకున్నాడు.. వీడు మారిపోయాడు.. అది ఇది అని. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని ఫాలో అయ్యేవాడిని. హనుమాన్ చాలీసా చదివేవాడిని. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనసులో ఓం నమ: శివాయ అని అనుకునేవాడిని. ఆఫ్ కోర్స్ భారతీయుడిని, హిందువుని. నా మతం అంటే నాకూ ఇష్టం. మతం కోసం నేనూ ఫైట్ చేసే వాడిని. అయితే బేసికల్‌గా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. యూట్యూబ్‌లో వీడియో లేదు. చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం. కానీ సోషల్ మీడియాలో నా నెంబర్, నా కో యాక్టర్ నెంబర్ పెట్టేసి.. వీళ్లు హిందూ మతాన్ని హర్ట్ చేశారని స్టార్ట్ చేయగానే మాకు కాల్స్ రకరకాలుగా వచ్చాయి. బేసికల్‌గా నందీశ్వరుని స్టేజ్ మీద పెట్టుకుని నిష్టగా, చెప్పులవి విప్పేసి చేసిన స్ఫూఫ్ అది. అంటే, వీళ్లని హర్ట్ చేయాలని చేసిన, రాసిన స్కిట్ కాదు. సినిమాలో ఉన్న సీన్‌ని మేము అక్కడ చేయడం జరిగింది. దానికి చాలా మంది హర్ట్ అయ్యారు. హర్ట్ అయినందుకు వెంటనే నేను వీడియో చేసి క్షమాపణలు చెప్పాను.
హిందూ మతాన్ని, హిందూ దేవుడిని అన్నది నేను ఏం లేదు. మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు. నేనేంటో మీకు బాగా తెలియకపోయినా, కొంచమైనా తెలుసు. ఇలా ఆలోచనలు ఎప్పుడూ నా నోటి నుంచి రావు. ఎందుకంటే, నా మతాన్ని, నా దేశాన్ని నేను అంతే గట్టిగా ప్రేమిస్తా. కాబట్టి, ఈ న్యూస్ ఛానల్స్ వాళ్లు వ్యూస్ కోసం రకరకాల థంబ్స్ పెట్టి వాడుతున్నారు. దయచేసి నమ్మకండి.. ప్లీజ్. నేనేంటో మీకు బాగా తెలుసు. అలాగే ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా, నేను జాగ్రత్త పడతాను. జై శ్రీరామ్’’ అంటూ ఈ వీడియోలో రవి చెప్పుకొచ్చారు.
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ ‘రామా రామా’ స్పెషల్ ఏంటో తెలుసా?
అసలు ఈ స్కిట్‌లో ఏముందంటే.. చాలా మహత్తరమైన గుడి బావ, ఒక్కసారి నంది కొమ్ముల నుంచి స్వామివారిని చూడు, అద్భుతంగా కనబడతారు అంటూ.. రవి, సుడిగాలి సుధీర్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. రవి చూడమని చెప్పగానే, నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి సుడిగాలి సుధీర్ చూస్తే.. ఎదురుగా రంభ (Rambha) కనిపిస్తుంటుంది. మళ్లీ కాస్త కళ్లు పెద్దవి చేసుకుని చూసిన సుధీర్‌కు, రంభ క్లియర్‌గా కనిపిస్తుంది. అప్పుడు సుధీర్.. నాకేంటి అమ్మోరు కనిపిస్తుంది.. అని అనగానే.. రంభ.. ‘బావగారు, బావగారు.. బాగున్నారా’ అంటూ సీన్‌లోకి ఎంటరవుతుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు