Arjun Son Of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. బింబిసార చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే, రీసెంట్ గా తన కొత్త మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లిగా నటించింది. సయీ మంజ్రేకర్ దీనిలో కథానాయికగా నటిస్తోంది. కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లో విడుదల కానుంది.
Also Read: Cattle Market: పశువుల సంతలో ఇష్టారాజ్యం.. వేలం వేయకుండానే రికార్డులు.. ప్రభుత్వ ఆదాయానికి గండీ!
ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. తాజాగా, ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను వదిలారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి) దుర్మాగులకు బుద్ధి చెప్పాలని ప్రయత్నాలు చేస్తుండగా.. ఆమె కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్ ) మాత్రం రౌడీగా ప్రవర్తిస్తాడు. ఇదే సమయంలో అర్జున్ ని మంచి వాడిలా వైజయంతి ఎలా మారుస్తుంది? అసలు అర్జున్ రౌడీగా ఎందుకు మారాడు ? అతను మారడానికి ముఖ్య అంశాలు ఏంటి అనేది ఈ సినిమా (అర్జున్ సన్నాఫ్ వైజయంతి) కథ.
Also Read: CM Revanth Reddy: నిరుద్యోగం తగ్గాలంటే నైపుణ్యాలు కావాలి.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీపై సీఎం దృష్టి
ట్రైలర్ చూస్తుంటే ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. ఈ చిత్రంలో కొత్త కళ్యాణ్ రామ్ ను చూడబోతున్నామని తెలుస్తోంది. ఎందుకంటే, ఇతను అన్ని సీన్స్ లో ప్రాణం పెట్టినట్టు ఉన్నాడు. ముఖ్యంగా, విజయశాంతితో కనిపించిన సీన్స్ ఎమోషనల్ గా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే మతి పోతుంది. సస్పెన్స్ ఎలివెంట్స్ తో సాగుతూ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. దీనిలో అన్నీ అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మాస్ ఆడియెన్స్, క్లాస్ ఆడియెన్స్ కు అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఇక యాక్షన్ సీన్స్ అయితే, మాస్ ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేస్తాయి.
Also Read: CM Revanth Reddy: నిరుద్యోగం తగ్గాలంటే నైపుణ్యాలు కావాలి.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీపై సీఎం దృష్టి
సినిమా మొదటి నుంచి సెంటిమెంట్ సాగుతుంది. కళ్యాణ్ రామ్ చేసే మాస్ ఎంటర్టైనర్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఐతే, లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ హీరో నుంచి మాస్ ఎంటర్టైనర్ గా మరో ఐదు రోజుల్లో మన ముందుకు వస్తుంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో తల్లీ కొడుకు ఎమోషన్స్ ఆడియెన్స్ కు బాగానే వర్క్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మరి, ఈ చిత్రం ఆడియెన్స్ ను మెప్పిస్తుందో? లేదో చూడాలి.