షాద్ నగర్ స్వేచ్ఛ: Inter Student Suicide: మమ్మీ డాడీ సారీ ఐ మిస్టేక్ అంటూ లెటర్ రాసి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన షాద్నగర్ పట్టణంలోని చటాన్ పల్లి గ్రామంలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చటాన్ పల్లి గ్రామానికి చెందిన కటికల శ్రీరాములు మంజుల దంపతులకు ఓ కుమార్తె ఇద్దరు బాలురులు ఉన్నారు. శ్రీరాములు ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కుమార్తె ప్రణీతను మోయినాబాదులోని ఓ ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు. ఇద్దరూ కొడుకులు పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే శ్రీరాములు కుమార్తె ప్రణీత ఇటీవల మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. అమ్మానాన్నలతో పాటు ఇంట్లోనే ఉంటుంది. గత మూడు రోజుల క్రితం అమ్మ గారి ఇంటికి వెళ్లారు. అక్కడ జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ శనివారం ఉదయం ప్రణీత (18) మమ్మీ డాడీ సారీ సారీ సారీ ఐ మిస్టేక్ అంటూ… లెటర్ రాసి బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.
Also Read: Kamalapuram Students Failed: ఏమైందిరా.. మెుత్తం ఇలా కట్టకట్టుకొని ఫెయిల్ అయ్యారు..!
బాత్రూం లోకి వెళ్లిన అమ్మాయి ఎంతకి బయటికి రాకపోవడంతో తల్లి తండ్రులు ఆందోళనతో తలుపులు విరగొట్టి చూడగా వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా తెలిపారు. లెటర్ రాసి ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమొచ్చిందంటూ కన్నీటి పర్యాంతమవుతున్నారు. అమ్మాయి మృతి పట్ల పలువురు ప్రేమ వ్యవహారం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. తండ్రి శ్రీరాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పుట్టిన రోజునే..
ప్రణీత తన పుట్టిన రోజునే ఆత్మహత్య చేసుకుంది. శనివారం తన కుమార్తె పుట్టినరోజు ఉందని తండ్రి శ్రీరాములు ఎంతో సంబరంతో కొత్త బట్టలు తీసుకొచ్చాడు. సాయంత్రం కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు సైతం చేశాడు. సోదరులు సైతం అక్క పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్రణీత కుటుంబ సభ్యుల ఆశలను అడియాశలు చేస్తూ మరెన్నడు కలవలేని తిరిగిరాని లోకాలకు పయనమయ్యింది.
విగత జీవిగా ఉన్న ప్రణీత మృతదేహం వద్ద తల్లి తండ్రి సోదరులు అమ్మ అంటూ విలపించిన తీరు హృదయాలను ద్రవింపజేసింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/