AP Ropeway projects (Image Source: AI)
ఆంధ్రప్రదేశ్

AP Ropeway projects: భక్తులకు పండగే.. ఆ ఆలయాలకు కొత్తగా రోప్ వే అందాలు..!

AP Ropeway projects: పర్యాటకానికి కొత్త అందాలు తీసుకురావడంలో రోప్ వే ప్రాజెక్ట్స్ (Ropeway Projects) ముందు వరుసలో ఉంటాయి. ప్రధానంగా దట్టమైన అడవులు, కొండలు, కోనలు, ప్రకృతి రమణీయతల మధ్య వీటిని నిర్మిస్తుంటారు. దీంతో ఆకాశంలో దూసుకెళ్తూ ప్రకృతి అందాలు వీక్షించేందుకు పర్యటకులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ రోప్ వేలు ఏర్పాటు చేసిన చోటల్లా.. పర్యాటకం బాగా అభివృద్ధి చెందినట్లు అందరూ చెబుతుంటారు. ఇది గమనించిన ఏపీలోని కూటమి ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

డీపీఆర్ కు పిలుపు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా కొన్ని ఆలయాలు దట్టమైన అడవిలో, ఎత్తైన కొండల్లో ఉన్నాయి. ఆధ్యాత్మికం, పర్యాటకాన్ని కలగలిపి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం.. అక్కడ కొత్తగా రోప్ వే ప్రాజెక్ట్స్ ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. ముందుగా ఐదు ప్రాంతాలను పైలెట్ ప్రాజెక్ట్స్ కింద గుర్తించి.. డీపీఆర్ (Detailed Project Report) టెండర్లను ఆహ్వానించింది.

రాయలసీమలో రెండు
ప్రభుత్వం డీపీఆర్ ఆహ్వానించిన ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం (Sri Boyakonda Gangamma Temple) ఉంది. కొండ అగ్రభాగం నుంచి కిందకు 0.68 కి.మీ మేర రోప్ వే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను ఆహ్వానించింది. అలాగే కర్నూల్ లోని ప్రముఖ ఆహోబిలం దేవాలయం (Ahobilam Temple) లో కూడా రోప్ వేను ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహా స్వామి గుడి వరకూ 1.28 కిలోమీటర్ల మేర వీటిని అహ్వానించింది.

Also Read: Pink Moon 2025: మరికాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం.. చూడకుంటే బాధపడాల్సిందే!

మిగతా మూడు ఏవంటే?
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ (Kotappakonda Temple) వద్ద కూడా ఈ రోప్ వే ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు 15 కి.మీ దూరంలో ఎత్తైన కొండపై ఈ ఆలయం ఉంది. కింద నుంచి కొండ అగ్రభాగాన ఉండే పాత శివాలయం వరకూ 1.23 కి.మీ మేర రోప్ వే నిర్మించేందుకు డీపీఆర్ టెండర్లను సర్కార్ ఆహ్వానించింది. అలాగే విజయవాడ కృష్ణ నదికి ఆనుకొని ఉన్న భవాని ఐలాండ్ (Bhavani I land) లోనూ దీనిని తీసుకురానుంది. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా రోప్ వే ప్రాజెక్ట్ పరిశీలనలో ఉంది.

Also Read This: Kamalapuram Students Failed: ఏమైందిరా.. మెుత్తం ఇలా కట్టకట్టుకొని ఫెయిల్ అయ్యారు..!

ప్రాజెక్ట్ వస్తే జాతరే!
రోప్ వే ప్రాజెక్ట్స్ కోసం ప్రభుత్వం ఎంచుకున్న ఐదు ప్రాంతాలు.. ఎప్పుడు భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతుంటాయి. నిత్యం వేలాది మంది ప్రజలు అక్కడి ఆలయాలను దర్శించుకొని పరవశించిపోతుంటారు. నిత్యం రద్దీగా ఉంటే ఆ ప్రాంతాల్లో రోప్ వే ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టడం గొప్ప పరిణామని నిపుణులు భావిస్తున్నారు. అక్కడ ఈ రోప్ వేలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆద్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగానూ మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషిస్తున్నారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?