Naresh: స్టార్ హీరో శర్వానంద్(Sharwanand) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ” నారి నారి నడుమ మురారి ” (Nari Nari Naduma Murari) అనే కొత్త చిత్రంతో మన ముందుకు రానున్నారు. నందమూరి బాలకృష్ణ(Balakrishna) హిట్ మూవీ టైటిల్ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ అబ్బరాజు(Ram Abbaraju) తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ మూవీలో సంయుక్త మీనన్(Samyuktha Menon), సాక్షి వైద్య కథానాయికలగా నటిస్తున్నారు. అయితే, ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పతాకం పై అనిల్ సుంకర రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇప్పటికే ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read: Venkaiah Naidu: బూతులు మాట్లాడే వారికి బుద్ధి చెప్పారు.. వెంకయ్య నాయుడు కామెంట్స్
ఇక, ఇటీవల రిలీజైన దర్శనమే మెలోడీ సాంగ్ సినీ లవర్స్ ను కట్టి పడేస్తుంది. తాజాగా, ఈ పాటకు టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, సీరియల్ సిరిహనుమంతుతో కలిసి స్టెప్పులేశారు. ” దర్శనమే మధుర క్షణమే.. ప్రతినిమిషం పరవశమే ” అనే లిరిక్స్‌కు వీరిద్దరూ డ్యాన్స్ వేశారు.
పట్టు పంచెలో నరేష్ మెరిసిపోతున్నాడు.. సిరి పట్టు చీరలో కనిపించి అందర్ని ఆకట్టుకుంది. అయితే, వీడియో చివర్లో ఇద్దరూ హాగ్ చేసుకుని మరీ డ్యాన్స్ చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేసి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ” హీరోగా కూడా ట్రై చేయండి .. డ్యాన్స్ బాగా చేస్తున్నారంటూ “ కామెంట్స్ చేస్తున్నారు.