ITDP Kiran Kumar: వైఎస్ భారతిని అసభ్యకర వ్యాఖ్యలతో దూషించిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కిరణ్ కుమార్‌పై 111 సెక్షన్ పెట్టడం పట్ల జడ్జి మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఐకు ఛార్జ్ మెమో ఇవ్వాలని ఎస్పీని కోర్టు ఆదేశించింది. లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీకి న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
కాగా, ఏప్రిల్ 24 వరకు కిరణ్ రిమాండ్ ఉండనున్నాడు. దీంతో కిరణ్‌ను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. అంతకుముందు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కిరణ్‌కు ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు న్యాయస్థానం వద్ద మోహరించారు. చేబ్రోలుపై ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేయగా మంగళగిరి పోలీసులు కొత్తగా మరో కేసు నమోదు చేశారు.
ఓవరాక్షన్..
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు మిగతా ఐదుగురు నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో మాధవ్ సహా ఇతర నిందితులను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు.
అంతకుముందు మాధవ్‌ను తొలుత నల్లపాడు పీఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మాధవ్‌ను ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. గోరంట్ల తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. మాధవ్‌కు రిమాండ్ తిరస్కరించాలని, పోలీసులు నమోదు చేసిన నాన్ బెయిలబుల్ సెక్షన్లు వర్తించవని వాదనలు వినిపించారు.
Also read: SP Akhil Mahajan: కాలీగా తిరిగితే జైలుకే యువతకు వార్నింగ్.. ఎస్పీ అఖిల్ మహాజన్
ఒకే రోజు రెండు కేసులలో ఇన్వాల్వ్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంలో తాడేపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. తర్వాత గుంటూరు వచ్చిన మాధవ్ చుట్టుగుంట వద్ద పోలీసు వాహనాన్ని అడ్డగించారు. ఆ తర్వాత పోలీసుల అదుపులో ఉన్న ముద్దాయి కిరణ్‌పై దాడికి యత్నించారు’ అని పోలీసుల తరుఫున ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
అయితే మాధవ్‌ను గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మరోసారి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి మాధవ్ నిరాకరించారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.