Renu Desai
ఎంటర్‌టైన్మెంట్

Renu Desai: నా రెండో పెళ్లే మీకు ముఖ్యం.. అంతేనా!

Renu Desai: రేణు దేశాయ్ రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని.. రెండో పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక్క రెండో పెళ్లి అనే కాదు, ఇంకా ఎన్నో విషయాల గురించి ఆమె చాలా స్పష్టంగా మాట్లాడారు. పిల్లలకు గాయిత్రి మంత్రం, శాంతి మంత్రం వంటివి నేర్పాలని చెప్పారు. ఇంకా, ఒక బంధం సాఫీగా సాగాలంటే భర్త, భార్యల మధ్య సమన్వయం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ఇలా ఒక్కటేమిటి ఆమె చాలా విషయాల గురించి మాట్లాడారు. కానీ అవేమీ ఫోకస్ కాకుండా.. కేవలం రెండో పెళ్లి గురించి ఆమె మాట్లాడిన మాటలపై మాత్రం మీడియా ఫోకస్ పెట్టడంతో రేణు దేశాయ్ అసహనానికి గురయ్యారు.

Also Read- Vaani Kapoor: ఈ అందంతోనే ఇంకా నెట్టుకొస్తుంది.. ఫొటోలు వైరల్!

ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను విడుదల చేసి, మీడియాకు చురకలు అంటించారు. మాములుగా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ప్రతి చిన్న విషయంపై చాలా పెద్దరికంగా ఆమె రెస్పాండ్ అవుతుంటారు. ముఖ్యంగా మూగ జీవాలకు ఏవైనా ఇబ్బందులు వస్తే.. వెంటనే వాటిని సంరక్షించేందుకు రంగంలోకి దిగుతారు. ఆమె ఏ వీడియో చేసిన చాలా ఓపికగా, సహనంగా మాట్లాడుతుంటారు. తనపై ఎవరు ఎన్ని రాతలు రాసుకున్నా డోంట్ కేర్ అని భావిస్తూ.. తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్లి పోతుంటారు. కానీ ఈ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ విషయంలో ఫోకస్ అవుతున్న అంశంపై, కాదు కాదు మీడియా ఫోకస్ పెట్టిన అంశంపై మాత్రం ఆమె కాస్త డిజప్పాయింట్ అయ్యారనే చెప్పుకోవాలి.

">

‘‘మీడియా వాళ్లకి అర్జెంట్‌గా నా రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు కావాలి. దీనిపై వారు ఎంతో ఆసక్తిగా ఉన్నారనేది నాకు అర్థమైంది. లేదంటే, నేను గంటకు పైగా జరిగిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాల గురించి మాట్లాడాను. మతాల గురించి, పిల్లల పెంపకం, సామాజిక బాధ్యత ఇలా ఎన్నో అంశాల గురించి మాట్లాడాను. అవేమీ జనాలకి, మీడియాకు అక్కరలేదు. వాటన్నింటి కంటే కూడా నా రెండో పెళ్లికే వారంతా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనేది నాపై వస్తున్న వార్తలు మరోసారి నిరూపిస్తున్నాయి. ఈ సందర్భంగా నేను అందరినీ కోరేది ఒక్కటే. ఒక 44 సంవత్సరాల మహిళ వివాహంపై కాకుండా, సమాజంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. వాటిపై ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Also Read- Srikanth: తను చేయాల్సిన సినిమాలో రాజశేఖర్‌.. శ్రీకాంత్‌‌ ఎంతగా బాధపడ్డారంటే!

ఒక్కసారి పాడ్‌కాస్ట్ వీడియో చూడండి. అందులో మహిళల రక్షణ గురించి, ఆర్థిక అభివృద్ధి, పన్ను ఆంక్షలు, వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు ఇలా అనేక విషయాల గురించి నేను ప్రస్తావించాను. వీలైతే ఆ విషయాలపై శ్రద్ధ పెట్టండి. మంచి పౌరులుగా, అంతకు మించి మంచి మనుషులుగా మారండి. పదే పదే నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. ఎందుకంటే, అది నా లైఫ్‌లో చాలా సున్నితమైన అంశంగా మారిపోయింది. కాబట్టి, మీకున్న జ్ఞానాన్ని ఓ మహిళ రెండో పెళ్లిపై కాకుండా.. సమాజాన్ని, చట్టాలను ప్రభావితం చేసే అంశాలపై ఉపయోగించండి’’ అంటూ రేణు దేశాయ్ ఈ వీడియోలో తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్