Srikanth vs Rajasekhar
ఎంటర్‌టైన్మెంట్

Srikanth: తను చేయాల్సిన సినిమాలో రాజశేఖర్‌.. శ్రీకాంత్‌‌ ఎంతగా బాధపడ్డారంటే!

Srikanth: ఫ్యామిలీ హీరో‌గా శ్రీకాంత్ అందరికీ పరిచయమే. కెరీర్ మొదట్లో విలన్‌గా కూడా నటించిన శ్రీకాంత్, ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో రేంజ్‌కి చేరుకున్నాడు. ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో అందరినీ ఔరా అనిపించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రలు చేస్తూ, ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. అయితే అప్పట్లో శ్రీకాంత్ బాధపడిన సందర్భం ఒకటి, ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. తాజాగా శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తను హీరోగా అనుకున్న సినిమాకు, చివరి నిమిషంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్‌ (Rajasekhar)ని తీసుకుని, నన్నెంతో బాధపెట్టారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

Also Read- Odela 2: తమన్నా, వశిష్ట పాత్రల మధ్య టగ్ ఆఫ్ వార్‌‌.. ఇంకెన్నో సర్‌ప్రైజ్‌లుంటాయ్!

మరో విశేషం ఏమిటంటే, ఆ సినిమాలో శ్రీకాంత్‌ ఓ కీలక పాత్రలో కనిపించాల్సి వచ్చిందట. నిజంగా ఇది ఏ హీరోకైనా బాధ కలిగించే విషయమే. తను హీరోగా చేయాల్సిన సినిమాలో వేరే హీరోని తీసుకుని, మళ్లీ అందులో ఓ కీలక పాత్రతో తనతో వేయించడమంటే.. వేరొకరైతే నేను చేయను అని వెళ్లిపోయేవారు. కానీ శ్రీకాంత్‌ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న రోజులివి. అందుకే బాధతోనే ఆ పాత్రను చేసినట్లుగా శ్రీకాంత్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ శ్రీకాంత్‌ని కాదని, రాజశేఖర్‌ని తీసుకున్న ఆ సినిమా ఏంటి? ఎందుకలా చేశారు? అనే వివరాల్లోకి వెళితే..

శ్రీకాంత్ కాస్త డౌన్‌లో ఉన్న రోజులవి. అయితే అనూహ్యంగా ఆయనకు రాజశేఖర్ హీరోగా చేసిన ‘వేటగాడు’ (Vetagadu) సినిమాలో మొదట హీరోగా అవకాశం వచ్చిందట. ఆ సినిమాలో సౌందర్య (Soundarya), రంభ (Rambha) హీరోయిన్లుగా చేస్తుండటంతో పాటు, హీరో పాత్రకు కాస్త నెగిటివ్ షేడ్స్ ఉండటంతో మళ్లీ తన కెరీర్ ఆ చిత్రంతో గాడిలో పడుతుందని భావించారట. ‘వేటగాడు’ సినిమా బాలీవుడ్ మూవీ ‘బాజీఘర్’కు రీమేక్‌గా తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో చేయడంతో పాటు నిర్మించారు కూడా. అంతకు ముందు ఆయన శ్రీకాంత్‌తో ‘దొంగరాస్కెల్’ అనే సినిమా చేసి ఉన్నారు. దీంతో ‘వేటగాడు’ సినిమా కూడా శ్రీకాంత్‌తోనే చేయాలని అన్ని రెడీ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఈ పాత్ర కోసం రాజశేఖర్‌‌ని లైన్‌లోకి తెచ్చారట తమ్మారెడ్డి.

Also Read- Trisha: మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి.. త్రిష అసహనం

తమ్మారెడ్డి ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారనేది తెలియదు కానీ, ఈ నిర్ణయంతో చాలా బాధపడ్డానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆ సినిమా చివరిలో పోలీస్ పాత్ర కోసం తనని తమ్మారెడ్డి ఒప్పించారని, తనకి ఇష్టం లేకపోయినా ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని శ్రీకాంత్ తెలిపారు. అయితే శ్రీకాంత్ బాధపడటానికి కారణం, ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ కనుక తనకి పడి ఉంటే, తన రేంజ్ మారిపోయేదని, టైర్ 1 హీరోల జాబితాలోకి వెళ్లేవాడినని ఆశపడ్డారట. ఈ విషయం రైటర్ తోట ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక శ్రీకాంత్‌ని బాధపెట్టి రాజశేఖర్‌తో చేసిన ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాతో తమ్మారెడ్డి భారీగా నష్టపోయారని తోట ప్రసాద్ వెల్లడించారు. అది విషయం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్