Trisha: త్రిష ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఏలిన త్రిష.. కొంతకాలం పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. మధ్యలో పెళ్లి అంటూ వార్తలు రావడం, ఆ తర్వాత పెళ్లి ఆగిపోయిందంటూ ఇలా రకరకాలుగా ఆమెపై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. త్రిష సినిమాలు చేయకపోయినప్పటికీ, ఆమె పేరు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉండేది. ఇక రీ ఎంట్రీలో ఈ భామకు తిరుగే లేదు అనేలా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’తో మరోసారి తన సత్తా చాటిన త్రిష, ఆ తర్వాత వరస ఆఫర్లతో తన స్టార్‌డమ్‌ని తిరిగి తెచ్చుకుంది.
Also Read- Sodaraa: సంపూ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చిన నిర్మాత.. మ్యాటర్ ఏంటంటే?
ఇప్పుడు తెలుగులో మరోసారి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పక్కన నటించే ఛాన్స్‌ని కొట్టేసింది. అవును, చిరు హీరోగా తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara)లో త్రిషానే హీరోయిన్. అయితే సినిమాపరంగా పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం త్రిష ఎప్పుడూ అగ్రెసివ్‌గానే ఉంటూ, సమయం వచ్చినప్పుడల్లా నెటిజన్లకు ఇచ్చిపడేస్తుంటుంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారాలు చేసే వారిపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ మండిపడింది. (Trisha Vs Trolls)
సోషల్ మీడియాలో లేనిపోని వార్తలను ప్రచారం చేసే వారిని విషపూరిత వ్యక్తులుగా పోల్చుతూ త్రిష ఫైర్ అయింది. ‘‘మీరంతా విషపూరితమైన వ్యక్తులు.. అసలు మీరెలా జీవిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకసలు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది? ఏం పనీ పాటా లేకుండా ఖాళీగా కూర్చుని ఇతరులపై పిచ్చి పిచ్చి పోస్టులు చేయడమేనా మీ పని? మీలాంటి వారిని చూస్తుంటే నిజంగా నాకు భయమేస్తుంది. మీతో పాటు ఎవరైతే కలిసి జీవిస్తున్నారో, వారి గురించి తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది. నిజంగా మీరు ధైర్యవంతులని అనుకుంటారు, కానీ మీరు పిరికివాళ్లు. మీది పిరికితనం. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని త్రిష తన ఇన్‌స్టాలో పిచ్చి పిచ్చి రాతలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read- Hari Hara Veera Mallu: ‘వీరమల్లు’పై ఇంకా డౌట్సా? ఈ క్లారిటీ సరిపోతుందా?
అసలు ఉన్నట్లుండి త్రిష ఇలా పోస్ట్ చేయడానికి కారణం ఏంటనే అనుమానం వస్తుంది కదా. అందుకు కారణం ఉంది. తాజాగా అజిత్ (Ajith Kumar) హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) అనే సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ఇందులో త్రిష యాక్టింగ్‌పై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ డబ్బింగ్ విషయంలో త్రిషను ఏకిపారేస్తున్నారు. తమిళ్ వచ్చి కూడా వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం ఏంటి? అసలెందుకు ఇలాంటి వారిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారు? అంటూ వస్తున్న కామెంట్స్‌పై త్రిష పై విధంగా రియాక్ట్ అయింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది. పలువురు నటీమణులు ఆమెకు మద్దతిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు