Vaani Kapoor: ఈ అందంతోనే ఇంకా నెట్టుకొస్తుంది.. ఫొటోలు వైరల్!
-
1 / 7Vaani Kapoor (Image Source: Vaani Kapoor Insta)
మంచి హైట్, ఆ హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, యాక్టింగ్ స్కిల్, టాలెంట్ ఇలా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అనేలా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ కెరీర్ కొనసాగుతుంది. -
2 / 7Vaani Kapoor (Image Source: Vaani Kapoor Insta)
ఆమెకు కాస్త కూడా అదృష్టం కలిసిరావడం లేదు. బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2013లో యష్ రాజ్ ఫిల్మ్స్ ‘శుద్ద్ దేశీ రొమాన్స్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన వాణి కపూర్, వెంటనే ‘బేఫికర్, వార్’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టింది. -
3 / 7Vaani Kapoor (Image Source: Vaani Kapoor Insta)
అంతే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ముంబైగా మారింది. ఆ తర్వాతే పాపం బ్యాడ్ లక్ వెంటాడుతూ వస్తుంది. ఆ హ్యాట్రిక్ తర్వాత ఆమె చేసిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. -
4 / 7Vaani Kapoor (Image Source: Vaani Kapoor Insta)
దీంతో వాణి కపూర్ కెరీర్ డైలామాలో పడిపోయింది. ప్రస్తుతం ఆమె రేంజ్ స్టార్ హీరోల నుంచి మిడియమ్ రేంజ్ హీరోలకు పడిపోయింది. -
5 / 7Vaani Kapoor (Image Source: Vaani Kapoor Insta)
సినిమాల పరంగా చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నా, హిట్ మాత్రం ఆమెకు అందని ద్రాక్షగానే మారింది. ఆమె ఆశలన్నీ అజయ్ దేవగన్‌తో చేస్తున్న ‘రైడ్ 2’ పైనే ఉన్నాయి. -
6 / 7Vaani Kapoor (Image Source: Vaani Kapoor Insta)
ఈ సినిమా పడిపోతున్న తన కెరీర్‌ను తిరిగి నిలబెడుతుందని వాణి కపూర్ ఆశపడుతోంది. మరి ఆమె ఆశలు ఎంత వరకు తీరుతాయో చూడాలి. -
7 / 7Vaani Kapoor (Image Source: Vaani Kapoor Insta)
సినిమాల సంగతి ఇలా ఉంటే, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే గ్లామర్ ఫొటోలు చూపు తిప్పుకోనివ్వనంతగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఇంకా ఇంకా ఆమెకు అవకాశాలు వస్తున్నాయనేలా టాక్ నడుస్తుంది.
