Telangana TET 2025: తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం (Telangana Govt) తీపి కబురు చెప్పింది. తెలంగాణ టెట్ (Telangana TET 2025 Notification) పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ తాజా నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. తాజా నోటిఫికేషన్ నేపథ్యంలో డీఎస్సీ (Telangana DSC)కి సిద్ధమవుతున్న అభ్యర్థులు అలర్ట్ అయ్యారు.
Also Read: Sri Varshini on Aghori: ఉప్పెన మూవీని తలపిస్తున్న అఘోరీ ప్రేమ కథ.. అదేం పెద్ద సమస్య కాదట!
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పరీక్షలకు మాత్రమే ప్రస్తుతం రిక్రూట్ మెంట్ ప్రక్రియ జరుగుతోంది. కొత్తగా ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ను తెలంగాణ సర్కార్ ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చాకే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించే టెట్ పరీక్షను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాక డీఎస్సీ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.