Odela 2 Producer D Madhu
ఎంటర్‌టైన్మెంట్

Odela 2: తమన్నా, వశిష్ట పాత్రల మధ్య టగ్ ఆఫ్ వార్‌‌.. ఇంకెన్నో సర్‌ప్రైజ్‌లుంటాయ్!

Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. ఇందులో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో ఆమె అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. దర్శకుడు సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మిస్తున్నారు. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను నిర్మాత డి మధు (Producer D Madhu) మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Trisha: మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి.. త్రిష అసహనం

‘ఓదెల 2’ ఎలా మొదలైందంటే.. ‘ఓదెల’ ఫస్ట్ పార్ట్ నేను సంపత్ నంది (Sampath Nandi)కి తెలియకుండానే చూశాను. ఆ సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాను. దానికి సీక్వెల్ అంటూ చేస్తే నేనే చేయాలని అనుకుంటున్న సమయంలో, అనుకోకుండా సంపత్ నంది ‘ఓదెల2’ కథని నాతో చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నామని చెప్పాను. అలా ఈ ప్రాజెక్టు మొదలైంది. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్యాషన్ ఉంది. కమర్షియల్‌గా కాకుండా సినిమాపై ప్యాషన్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. సంపత్ నందితో నాకు మంచి వేవ్ లెంత్ కుదిరింది. భవిష్యత్తులో ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నాను. ఒక మంచి ప్రాజెక్ట్ రావాలంటే ఒక మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి. అలాంటి అండర్ స్టాండింగ్ మా ఇద్దరి మధ్య ఉంది.

ఇందులో తమన్నా అద్భుతంగా నటించారు. ఫస్ట్ లుక్‌తోనే ఆమె పాత్ర ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ కథ విషయంలో తమన్నా చాలా ఎక్జయిట్ అయ్యారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఏప్రిల్, మే ఎండల్లో చెప్పులు లేకుండా షూటింగ్ చేశారు. కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ కథ ఆమె దగ్గరకు వెళ్లిందని నేను నమ్ముతున్నాను. నాకు మొదటి నుంచి ఏదైనా వినూత్నంగా చేయాలని ఉంటుంది. కాశీలో ఈ సినిమాని ప్రారంభించాం. అలాగే మహా కుంభమేళాలో టీజర్‌ని విడుదల చేశాం. చాలామంది అది రిస్క్‌తో కూడుకున్న పని అని అనుకున్నారు. అయితే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే సక్సెస్ ఉంటుందని నేను నమ్ముతాను. మంచి కథలు, కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్టెడ్‌గా చేయాలనేదే నా ప్రయత్నం.

Also Read- Sodaraa: సంపూ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చిన నిర్మాత.. మ్యాటర్ ఏంటంటే?

నేను కథ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను. చాలా డిస్కషన్స్ జరుగుతాయి. అలాంటి డిస్కషన్స్ జరిగాయి కాబట్టే ఈ సినిమా అంత గ్రాండ్‌గా వచ్చింది. నేను సెట్స్‌కి వెళ్తాను. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడ రాజీపడకుండా సినిమాని గ్రాండ్ స్కేల్‌లో నిర్మించడం జరిగింది. ఈ సినిమా కథ లాజికల్‌గా ఉంటుంది. ప్రతిదీ ఆధారంతోనే చూపించాము. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తాయని నమ్ముతున్నాను. ఈ కథలో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. తమన్నా, వశిష్ట.. ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య టగ్ ఆఫ్ వార్‌లా ఉంటుంది. అలాగే మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, హెబ్బా.. ఈ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి.

అజనీస్ లోక్‌నాధ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. సౌందర్ రాజన్ చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు. అలాగే ఇందులో గ్రాఫిక్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. పంచభూతాల కాన్సెప్ట్‌ని గ్రాఫిక్స్‌లో చూపించడం జరిగింది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో మేము ఆలోచించలేదు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే భావించాం. నేను ప్రతి కథలో ఎమోషన్ చూస్తాను. భవిష్యత్‌లో మంచి ఎమోషన్ ఉన్న కథలు తీయాలని ఉందని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు