Liquor Drinking Effect: ఈ మధ్య కాలంలో ఎంతో మంది మద్యపానం సేవిస్తూ ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక కొందరైతే చుక్కకావాలి, ముక్క కావాలి అన్నట్టు చేస్తుంటారు. తాగిన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయో అది మాత్రం తెలుసుకోలేక పోతున్నారు. అయితే, ఇప్పటి వరకు మందు ఆరోగ్యానికి మంచిదని ఏ అధ్యయనం చెప్పలేదు. కానీ, ఇది తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని చాలా మంది భ్రమ పడి దీనిని సేవిస్తుంటారు. ఒక్కసారి ఇది అలవాటుగా మారితే, దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. రోజూ మద్యం సేవించే వ్యక్తి ఒక్కసారిగా మానేయాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాలి. దాని కోసం, ఎన్నో రకాల ఇంగ్లిష్ మెడిసిన్స్ వాడుతాడు .. అయిన కూడా ఫలితం ఉండదు.
Also Read: CM Revanth Reddy: నిరుద్యోగం తగ్గాలంటే నైపుణ్యాలు కావాలి.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీపై సీఎం దృష్టి
మద్యం సేవించే వారిలో ఎవరైతే మూడు , నాలుగు నెలలకు ఓసారి డ్రింక్ చేస్తారో, వారి శరీరంలో కొత్త మార్పులు వస్తాయి. అయితే, రోజూ తాగేవారు .. ఒకేసారి మానేస్తే ఉన్న కొత్త సమస్యలు వచ్చే ఆవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సడెన్ గా మద్యం మానేయడం వలన ఒక్కొసారి ప్రాణాలు కూడా పోతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఒక్కసారిగా మద్యం మధ్యలోఆపేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక్కసారిగా మద్యం మానేయడం వలన వలన నీరసం, ఒత్తిడి తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే, చెవుల్లో వింత శబ్దాలు వినిపిస్తాయి. ఈ అలవాటు నుంచి బయటపడే సమయంలో ఒక రకమైన సిండ్రోమ్ ఎదురవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, డ్రింక్ ఆపేయాలనుకునేవారు క్రమక్రమంగా డోస్ తగ్గిస్తూ దూరం పెట్టాలని చెబుతున్నారు. రెండు మూడు నెలలకు ఓసారి.. మద్యం సేవించే వారికీ ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. ప్రతిరోజూ తాగేవారి పరిస్థితి మాత్రం కొంచం కష్టంగా ఉంటుందని అంటున్నారు. మూడు రోజుల్లోనే ఆలోచనా తీరు మొత్తం మారిపోతుంది. కొన్నిసార్లు అయితే, తెలియకుండానే కోపం వస్తుంది. ఐదేళ్ళ ఏళ్ళ డ్రింక్ తాగే వారు అకస్మాత్తుగా మద్యం మానేస్తే , కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.