AP Inter Results 2025 (Images Source: AI)
ఆంధ్రప్రదేశ్

AP Inter Results 2025: రేపే ఇంటర్ ఫలితాలు.. ఈ మార్పులు గమనించారా.. లేకుంటే కష్టమే!

AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. రేపు రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉ 11 గంటలకు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

రేపు విడుదలయ్యే ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ సూచించారు. అలాగే మన మిత్ర ద్వారా తొలిసారి ఫలితాలను పొందే అవకాశాన్ని కల్పించారు. వాట్సాప్ నెం. 9552300009 ద్వారా ఫలితాలను పొందవచ్చు. దీని ద్వారా మెుబైల్ నుంచే రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు.

ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. మార్చి 1- 19 మద్య జరగ్గా.. సెకండియర్ కు మార్చి 3- 20 మధ్య నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ , సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షల మంది పరీక్షలు హాజరైనట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఇంటర్ పరీక్షలు జరుగుతున్న క్రమంలోనే మార్చిన 17 నుంచి.. మూల్యాంకన ప్రక్రియను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రారంభించింది. 25 కేంద్రాల్లో నాలుగు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం ఫలితాలను కంప్యూటీకరణ చేసి భద్రపరిచారు. ఇందుకు అనుగుణంగా రేపు ఫలితాలు విడుదల కానున్నాయి.

ఏపీలో పోలిస్తే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు కాస్త ఆలస్యంగా రానున్నాయి. ఏఫ్రిల్ 24న ఫలితాలు విడుదల చేసే అవకాశముంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ బయటకు రానున్నట్లు ప్రచారం జురుగోతంది. ఇంటర్ ప్రథమ, ద్వితియ ఫలితాలను ఒకేసారి ప్రకటించే అవకాశముంది.

పేపర్ల వాల్యుయేషన్ పూర్తయింది. దీంతో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించనున్నారు.

Also Read: AP Penamaluru Tragedy: కుమారుడికి ఐస్ క్రీమ్ తినిపించి మరీ.. చంపిన తండ్రి.. కారణానికి కన్నీళ్లు రావాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా వెల్లడించనుంది. ఫలితాలు విడుదలైన తరువాత విద్యార్థులు వాట్సాప్ నెం. 9552300009 ద్వారా లేదా.. అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in/ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!