AI Technology In Schools (imagecredit:AI)
రంగారెడ్డి

AI Technology In Schools: హైటెక్‌ బోధన.. ఆన్‌లైన్‌ సాధన.. సూపర్‌ సక్సెస్!

రంగారెడ్డి బ్యూరో స్వేచ్చః AI Technology In Schools: ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్నది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్య మైంది. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఏఐని ప్రవేశపెట్టింది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో అమలు చేసిన ఏఐ విద్య సత్ఫలితాలను ఇస్తోంది. ఎంపిక చేసిన స్కూళ్లలో ప్రత్యేక కంప్యూటర్‌ ల్యాబ్‌ లు ఏర్పాటు చేసి విద్యార్థులకు హైటెక్‌ విద్యను అందిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల బలహీనతలను గుర్తించి వారి సామర్థ్యాలను మెరుగు పర్చేందుకు తోడ్పాటునందిస్తున్నారు. ఏఐ విద్యతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులతో పోటీచేసే స్థాయికి చేరుకుంటారని నిపుణులు పేర్కొంటున్నారు.

35 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో యేటా అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోవడం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు కృత్రిమ మేథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముందుగా ప్రాథమిక పాఠశాలల్లో చదివే వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంపాందించేందుకు ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్​‍) సాయంతో పాఠాలు బోధించడం మొదలుపెట్టారు. విద్యార్థులు తెలుగు బాగా చదవడం, గణిత అంశాల్లో పట్టు సాధించేలా కృత్రిమ మేథ సాయంతో ఆకట్టుకునే విధంగా పాఠ్యాంశాలను రూపొందించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 35 స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇందుకుగాను 50 మందికి పైగా విద్యార్థులుగల 20 ప్రాథమిక పాఠశాలలను గుర్తించారు. ఏఐ బోధించేందుకు పలువురు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఫండమెంటల్‌ లిట్రసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌) ప్రకారం ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు మార్చి 15వ తేదీ నుంచి విద్యాబోధనను మొదలు పెట్టారు. వీటిని పర్యవేక్షించేందుకు రాష్ర్ట ప్రభుత్వం బెంగళూరుకు చెందిన ఏక్‌ -స్టెప్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

Also Read: Former MLA Shakeel Aamir: అజ్ఞాతంలో బీఆర్ఎస్ ముఖ్య నేత.. పక్కా ప్లాన్ తో పట్టుకున్న పోలీసులు

తమిళనాడు రాష్ర్టంలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండడంతో మన రాష్ర్టంలో కూడా కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో విద్యా బోధన ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏఐని ఒక సబ్జెక్టుగా ప్రవేశ పెట్టి క్రమంగా 50 మంది వరకు గల మరిన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా బోధనను ఆరంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఆకట్టుకుంటున్న ఏఐ అభ్యసనంః

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదవడం, రాయడం గణితం సరిగా చేయక పోవడం వంటివి లోపాలు ఉన్నాయి. అలాంటి విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐ ద్వారా విద్యా బోధన చేస్తున్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులు ఈ టూల్స్​‍ ను ఉపయోగించుకొని స్వయంగా విద్యార్థులే తెలుగు, ఇంగ్లీష్‌ భాషలో అక్షరాల గుర్తింపు, సరళ పదాలు, వారి స్థాయిని బట్టి పదాలను చదవడం, రాయడం, గణితంలో సంఖ్యలు రాయడం, కూడిక నుంచి మొదలుకొని భాగాహారం వరకు నేర్చుకోవడానికి ఏఐ దోహదపడుతుంది.

దీని ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటోంది. వీటికి తోడుగా ఎ ఎక్స్​​టెల్‌ పేరుతో ఇంటెలిజెన్స్​‍ విద్యను అందిస్తున్నారు. ఫస్ట్ లెవెల్‌లో డిస్కవరిలో ఏఐ పిల్లల శక్తి సామర్థ్యాలు తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. దృశ్య, శ్రవణం ద్వారా జవాబు కూడా చెబుతుంది. ఏఐలో ఎక్సైడ్‌ ఫ్లో ఫౌండేషన్‌, ఏఐ లెర్నింగ్‌ టూల్స్​‍, అసిస్టెడ్‌ లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ (ఏఎల్‌ఎల్‌ ), అసిస్టెడ్‌ మ్యాథమెటిక్‌ లెర్నింగ్‌ (ఏఎంఎల్‌) ఇన్‌ స్టాల్‌ చేశారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ ద్వారా నేర్చుకున్న అంశాలను కంప్యూటర్‌ ముందు తప్పుగా చదివితే వెంటనే లోపాలను కనిపెట్టేస్తోంది.

Also Read: Janasena on Kavitha: పవన్ తో పెట్టుకున్న కవిత.. ఏకిపారేస్తున్న జనసైనికులు.. మరీ ఇంత ఘోరంగానా!

ప్రధానంగా 3, 4, 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో చదుపుల్లో వెనక బడిన వారిలో విద్యార్ధుల సంఖ్యకనుగుణంగా 5, 10, 15 మందిని ఒక్కో బ్యాచ్‌ గా విభజించారు. ఒక్కో బ్యాచ్‌ కు తెలుగు, గణిత అభ్యాసాలపై 20, 40 నిమిషాల పాటు కృత్రిమ మేథ పాఠ్యాంశాల బోధన చేస్తున్నారు. అభ్యాసానికి సంబంధించిన అంశాల్లో 70 శాతానికి పైగా సరైన సమాధానాలు సాధిస్తేనే మరో పాఠ్యాంశం నేర్చు కునేందుకు అవకాశం ఉంటుంది.

అంతకంటే తక్కువగా మార్కులు వస్తే ఆ పాఠ్యాంశాన్ని మరోసారి అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఏఐ విద్యాబోధనను ఏక్‌ -స్టెప్‌ సంస్థ పర్యవేక్షించి లోపాలను సరిదిద్దుతోంది. అలాగే ఏఐ ద్వారా వచ్చే ఫలితాలపై నివేదిక రూపొందించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేస్తోంది.

పైలెట్‌ ప్రాజెక్టు సక్సెస్ః సుశీంధర్‌ రావు, డిఈవో, రంగారెడ్డి జిల్లా

జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద పది పాఠశాలల్లో ఏఐ విద్యను అమలు చేస్తున్నాం. సక్సెస్ ఫుల్‌గా ఈ కార్యక్రమం నడుస్తోంది. ఏఐ పాఠాలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం మరికొన్ని స్కూళ్లలో ఏఐ విద్యను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. టీచర్లకు ప్రత్యేక శిక్షణను త్వరలోనే ఇవ్వనున్నాం.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు