నిజామాబాద్ క్రైం స్వేచ్ఛ: ACP Raja Venkat Reddy: చట్ట వ్యతిరేక నడుచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ 5 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాలు మేరకు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏసీపీ రౌడీషీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎసీపీ మాట్లాడుతూ..ఇప్పటి నుండి రౌడీ షీటర్స్ ఉన్న వారి పేర్లు గాని, మొహాలు గాని ఎలాంటి కేసులోనైనా, గ్రూపు తగాదాలలో ఐనా ఎవరి ప్రోద్బలంతో, ప్రభలంతోనైనా, ఎవరైనా ఫోన్లు లలో చెప్పడం వలన గాని నేరాలలో పాలుపంచుకోకూడదని తెలిపారు. ఈ కౌన్సిలింగ్ కు హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాలుపంచుకుంటే చట్టం లో ఉన్న ఆక్ట్ ల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడప వలసి వస్తుందని హెచ్చరించారు.
కౌన్సెలింగ్ నిర్వహించడానికి ప్రధాన కారణం మీ నేర ప్రవృత్తిని విడిచి కుటుంబ సభ్యులతో కలిసి మంచి జీవన ఉపాధి ఏర్పరచుకొని సత్ప్రవర్తనడం మెలగాలని అన్నారు. చెడు బుద్ధితో కొంతమంది చెప్పిన మాటలు విని,నమ్మి చట్ట వ్యతిరేకంగా పాల్పడితే జైలు పాలు కాక తప్పదని హెచ్చరించారు. బిర్యానీ ప్యాకెట్లు, మందు, కొంత డబ్బు లభిస్తుందేమో కానీ అది శాశ్వతమైనది కాదన్నారు.
Also Read: Viral Video: వామ్మో వీడు మామూలోడు కాదు.. నడి రోడ్డు మీద ఇలా చేశాడేంటి!
రౌడీ షీటర్ల పై ప్రత్యేకంగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు, రాత్రి, పగలు సమయంలో మీ ఇండ్లను సందర్శించి మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుందన్నారు. మీపై ఒక ప్రత్యేక టీం చేత నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటాం అన్నారు. కొంతమంది తమ ఫ్రెండ్స్ ను కొట్టారని, కొంతమంది మెప్పు కోసం, డబ్బుల కోసం జల్సాలకి, మత్తు పదార్థాలకు అలవాటు పడి గొడవలకు, నేరాలకు పాల్పడుతు, చట్టాన్ని చేతులకు తీసుకొంటున్నారు అది చట్టరీత్యా నేరం అన్నారు.
స్నేహితులు, ఇతరుల కోసం చట్ట వ్యతిరేకమైన కార్యాకలాపాలకు పాల్పడి కేసులు నమోదు అయి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఏదైనా సమస్య ఉన్న, అపాయం ఉన్న, ఎవరైనా దాడులకు పాల్పడిన, ఇబ్బంది కి గురి చేసిన పోలీస్ వారిని సంప్రదించాలని, డయాల్ 100 కి కాల్ చేయాలని సూచించారు. వెంటనే పోలీస్ స్పందిస్తారు అన్నారు.
ఈ సందర్భంగా చాలా కాలం నుండి రౌడీషీటు ఓపెన్ అయి ఉండి గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా సత్పవర్తన కలిగి ఉన్న వ్యక్తు లను గుర్తించి వారి యొక్క రౌడీషీట్లను తీసేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ లు, కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/