Bullet Removed from Brain: కేర్ హాస్పిటల్ వైద్యులు( Doctors )అరుదైన శస్త్ర చికిత్స చేసి, రోగి మెదడులో దూసుకుపోయిన బుల్లెట్టు ను విజయవంతంగా తొలగించారు. గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు డాక్టర్ శివరాజు శస్త్ర చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలలను వెల్లడించారు. సోమాలియాకు చెందిన గులేమ్ స్వదేశం లో జరుగుతున్న యుద్ధంలో అనుకోకుండా అతడి మొదడులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతను కోమాలోకి వెళ్ళాడు.
Also Read: CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?
స్థానిక వైద్యులు అతని మెదడులోని బుల్లెట్ ను తీసేందుకు ప్రయత్నించగా విఫలమయ్యారు. మెరుగైన చికిత్స కోసం గులేమ్ ను ఇండియాకు తీసుకొచ్చి కేర్ హాస్పిటల్ చికిత్స అందించారు. కేర్ హాస్పిటల్ వైద్యులు( Doctors ) గులేమ్ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీక్షించిన అనంతరం దాదాపు 12 గంటల పాటు సర్జరీ నిర్వహించి విజయవంతంగా బుల్లెట్ ను మెదడులో నుంచి తొలగించారు. బుల్లెట్ మెదడులో చాలా సున్నితమైన ప్రాంతంలో ఉందని, అలాంటి సమయంలో చిన్న పొరపాటు జరిగిన మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో బుల్లెట్ ను తొలగించడం గర్వకారణంగా ఉందని వైద్యులు( Doctors )పేర్కొన్నారు.
Alos Read: TG LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం క్లారిటీ .. రియల్ ఎస్టేట్ వ్యాపారులు..ఆ ఎమ్మెల్యేకు సత్కారం!
ఈ శస్త్ర చికిత్స భారతదేశంలోనే అరుదైనదని, చికిత్స అనంతరం రోగి వేగంగా కోటుకుంటున్నాడన్నారు. అనంతరం హైటెక్ సిటి కేర్ హాస్పిటల్ సీఓఓ నిలేశ్ మాట్లాడుతూ ఇలాంటి క్లిష్టమైన కేసులు కేర్ హాస్పిటల్ లో ఉన్న అతాధునిక వైద్య సదుపాయాల్ని, నిపుణుల నైపుణ్యాన్ని చూపిస్తాయని, ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు కేర్ హాస్పిటల్ ఆరోగ్య భరోసా కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేర్ హాస్పిటల్ వైద్య బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు