TG LRS[ image credit: swetcha reporter]
రంగారెడ్డి

TG LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం క్లారిటీ .. రియల్ ఎస్టేట్ వ్యాపారులు..ఆ ఎమ్మెల్యేకు సత్కారం!

TG LRS: రాష్ట్ర ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ రాయితీ గడువును పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకోవడం పట్ల రియాల్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం షాద్ నగర్ నియోజకవర్గ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ప్రత్యేకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాలువతో సత్కరించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు గత నెల 31తో ముగియగా.. ఏప్రిల్​ 30వ తేదీ వరకు గడువును ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల మరికొంత మంది లబ్ధిదారులకు సమయం తోపాటు వారి స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  Also Read: JAC Lacchi Reddy: ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని గడువు పొడిగించడం లబ్దిదారులకు మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, రాజు గౌడ్, ఉపాధ్యక్షులు ఎండి కబీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి మంచిరేవుల అశోక్, మహమ్మద్ అజమాత్, ఖాలేద్ ఖాన్, దాస రమేష్, శ్రీనివాస్ చారి, శ్రీను, దర్శన్, యాదగిరి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!