Chhaava OTT: ఈ మధ్యకాలంలో బాలీవుడ్ పరువును నిలబెట్టిన చిత్రంగా ‘ఛావా’ పేరును సొంతం చేసుకుంది. అంతకు ముందు బాలీవుడ్ గురించి మాట్లాడుకున్న వారే కరువయ్యారు. షారుఖ్ రెండు సినిమాలు మినహా బాలీవుడ్‌కు సరైన హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆ లోటును తీరుస్తూ వచ్చిన ‘ఛావా’ సంచలన విజయాన్ని అందుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి, బాలీవుడ్‌కు ఊపిరి పోసింది. ఈ సినిమాను తెలుగు రిలీజ్ చేయాలనేలా డిమాండ్ ఏర్పడిందంటే.. ఏ రేంజ్ సక్సెస్‌ను ఈ సినిమా అందుకుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Allu Arjun: పదేళ్ల తర్వాత బన్నీ ఆమెతో రొమాన్స్.. రికార్డ్స్ బ్రేక్ అవ్వడం పక్కా..!
అయితే తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ ఏర్పడినంతగా, సక్సెస్ మాత్రం రాలేదు. అవును, తెలుగులో ఈ సినిమా అంత గొప్పగా ఆదరణ రాబట్టలేకపోయింది. ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే తెలుగులో ఈ సినిమా అందుకుందని చెప్పాలి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు. అలా వేచి చూసే వారి కోసం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లోనే ఈ సినిమా ఓటీటీలో దర్శనమీయనుంది. అవును ఈ సినిమా ఓటీటీ వివరాలను సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే.. (Chhaava OTT Streaming Details)
Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️
Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd
— Netflix India (@NetflixIndia) April 10, 2025
విక్కీ కౌశల్ (Vicky Kaushal) శంభాజీ మహారాజ్‌గా నటించిన ‘ఛావా’ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 11 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా రికార్డులను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. విక్కీ కౌశల్ భార్య పాత్రలో యేసుబాయి భోంస్లేగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) నటించిన విషయం తెలిసిందే. థియేటర్లలో కనీవినీ ఎరుగని రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీలోనూ అత్యద్భుతమైన ఆదరణను రాబట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read- Vishwambhara: ఎట్టకేలకు అప్డేట్.. మెగా ఫ్యాన్స్ ఇక చూసుకోండమ్మా!
‘ఛావా’ కథ విషయానికి వస్తే.. (Chhaava Story) ఛత్రపతి శివాజీ మరణం అనంతరం మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, తేలికగా ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుని పాలించవచ్చని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు భావిస్తాడు. కానీ ఆయన పథకానికి విరుద్ధంగా ధైర్యంగా ఎదురు నిలబడతాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. అంతేకాదు, ప్రజల సొమ్మును దోచుకుని దాచిన కోశాగారంపై శంభాజీ దాడి చేస్తాడు. ఈ విషయం తెలిసి, దక్కన్‌లో బలం పుంజుకుంటున్న శంభాజీని ఎదుర్కొనేందుకు స్వయంగా ఔరంగజేబే రంగంలోకి దిగుతాడు. ఎంతో శక్తిమంతమైన ఔరంగజేబు మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పోరాటంలో శంభాజీకి ఎదురైన పరిస్థితులు ఏంటి? వంటి విషయాలతో విజువల్ వండర్‌గా రూపొందిన చిత్రమే ‘ఛావా’.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు