Railway Rules: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? లేకుంటే రైలు ప్రయాణానికి సిద్ధమవుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇక నుండి బీ స్మార్ట్ ప్రయాణం చేయండి అంటోంది రైల్వే. లేకుంటే ఫైన్ తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఔను.. ఇండియన్ రైల్వే ఓ కీలక ప్రకటన చేసింది. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని ఇండియన్ రైల్వే (indian railway) సూచిస్తోంది. రైల్వే రూల్స్ (railway rules) పాటించకుంటే ఫైన్ గ్యారంటీ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలని రైల్వే అంటోంది.
మనం సాధారణంగా రైలు ప్రయాణానికి సిద్ధం అవుతున్నామని అంటే, పెద్ద ప్లాన్ వేసేస్తాం. అయితే ఎక్కువ మంది కలిసి ప్రయాణించే సమయంలో మనకు ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఆ సమయంలో మనం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య లగేజీ భద్రత. అధిక లగేజీ ఉంటే చాలు, ఓ వైపు శ్రమ, మరో వైపు మన లగేజీ భద్రత పెద్ద సవాళ్లే. ఔను రోజువారీ రైలు ప్రయాణం సాగించే వారికి ఇదొక పెద్ద సమస్య. అందుకే రైలు ప్రయాణంకు సిద్ధమైన వారు పక్కా ప్లాన్ తో తమ లగేజీ సిద్ధం చేసుకుంటారు.
సుదూర ప్రాంతాలకు రైలు ప్రయాణం (train journey) సాగించే వారి పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. లగేజీ అధికం.. కావడంతో రైలు ఎక్కే సమయంలో ఎన్నో చిక్కులు. వారి లగేజీతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగే పరిస్థితి. ఇటువంటి ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెడుతూ, రైల్వే లగేజ్ వ్యాన్ లను అందుబాటులోకి తెచ్చింది.
మనం మన లగేజీ ఇబ్బందులు ఎదుర్కోకుండా, రైల్వేలో బుక్ (railway b0oking) చేస్తే చాలు, భద్రతకు భద్రత, ఇతరులకు ఇబ్బంది కలిగించని పరిస్థితి. అందుకే రైల్వే తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. అధిక లగేజీ ఉన్నవారు, దానిని మీతో తీసుకెళ్లడానికి బదులుగా లగేజ్ వ్యాన్‌లో బుక్ చేసుకోండి అంటూ సూచిస్తోంది. అలా బుక్ చేసుకొని స్మార్ట్ గా ప్రయాణించండి, చింత లేకుండా ప్రయాణించండి అంటూ దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.
Also Read: ITDP Kiran Arrest: ఐటీడీపీ కిరణ్ అరెస్ట్? వైసీపీ వదిలిపెట్టేనా?
అయితే అధిక లగేజీతో రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే, వారికి ఫైన్ తప్పదని రైల్వే ప్రకటించింది. మన ప్రయాణం ఇతరులకు అసౌకర్యం కాకుండా ఉండాలని, ప్రతి ప్రయాణికుడు సురక్షిత ప్రయాణంతో పాటు, స్మార్ట్ ప్రయాణం సాగించేందుకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. తస్మాత్ జాగ్రత్త.. రైలులో ప్రయాణించే సమయంలో ఇష్టారీతిన లగేజీ తీసుకెళుతున్నారా? అయితే ఫైన్ కట్టేందుకు సిద్ధంగా ఉండండి. అందుకే రైల్వే చేసిన సూచనలు పాటిద్దాం.. రైల్వే అధికారులకు సహకరిద్దాం.
🚆✋ रेलयात्रियों के लिए ज़रूरी सूचना! ✋🚆
अगर सफर में आपके पास ज्यादा सामान है, तो उसे साथ ले जाने की बजाय लगेज वैन में बुक कराएं।
✅ यात्रा होगी आरामदायक
✅ दूसरों को होगी सहूलियत
✅ जुर्माने से भी बचेंगेस्मार्ट ट्रैवल करें, बेफिक्र सफर करें! ✨💼🚉#IndianRailways… pic.twitter.com/dZnukroUCQ
— DRM Vijayawada (@drmvijayawada) April 10, 2025

