Mega DSC AP: రాష్ట్రంలో డీఎస్సీ ప్రకటన కోసం వేచిచూస్తున్న అభ్యర్థులకు సాధ్యమైనంత త్వరగా మెగా డీఎస్సీ ప్రకటన చేయడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డీఎస్సీ, టెన్త్, ఇంటర్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పన తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తిచేసి, రాబోయే నాలుగేళ్లు విద్యాప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా టెన్త్, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్‌కు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కు(ఎస్ఎల్ఎన్ పార్క్)ను ప్రారంభించారు. పార్క్‌ను రూ.1.06 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. మంగళగిరిలోని టిడ్కో పార్క్‌ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించిన పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. నులకపేట, చినకాకానిలో లేక్ పార్కులను కూడా అభివృద్ధి చేసి వాకర్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.
Also read: Notices to Jogi Ramesh: సీఎం ఇంటిపై దాడి.. మాజీ మంత్రికి సీఐడీ నోటీసులు!
మంగళగిరి ప్రజలకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడేందుకు అవసరమైన పార్కులను ఏర్పాటు చేస్తున్నామని. నియోజకవర్గంలో 40 పార్కులు, 35 కమ్యూనిటీ హాళ్లు, 6 చెరువులను అందుబాటులోకి తెస్తున్నట్లు లోకేష్ తెలిపారు.