Notices to Jogi Ramesh: వైసీపీ హయాంలో విర్రవీగిన ఒక్కో నేత భరతం పడుతోంది కూటమి సర్కార్! ఇప్పటికే పలువుర్ని జైలుకు పంపగా, బెయిల్‌పై కొందరు బయటికి రాగా, మరికొందరు ఊచలులెక్కెడుతున్నారు. అయితే ఇప్పుడిక వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ వంతు వచ్చేసింది.
జోగి రమేష్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తాడిగడప సీఐడీ కార్యాలయానికి శుక్రవారం (ఈనెల 11న) ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది. వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో భాగంగా విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.
Also read: ITDP Kiran Arrest: ఐటీడీపీ కిరణ్ అరెస్ట్? వైసీపీ వదిలిపెట్టేనా?
విచారణకు వచ్చేటప్పుడు ఆధారాలు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఇదే కేసులో గతంలో మూడుసార్లు జోగి విచారణకు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి కొత్త ఇంటికి భూమి పూజ చేసిన రోజే ఇలా నోటీసులు ఇవ్వడంతో కూటమి సర్కార్ రివెంజ్ తీర్చుకుంటోందని వైసీపీ ఆరోపిస్తున్నది.