TG Heavy Rains: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మొదలయ్యాయి. అయితే, ఈ సారి వాతావరణ పరిస్థితులు వింతగా మారాయి. చలి కాలంలో సూర్యుడు భగ భగ మండాడు. ఇక, ఇప్పుడు వానలు పడుతూ రోజుకొక లాగా ఉంటుంది. ఓ వైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఏ పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో వైపు సాయంత్ర సమయంలో వర్షాలు పడుతూ రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.
తాజాగా, తెలంగాణకు ( Telangana) మరో సారి వాతావరణ శాఖ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy Rains ) కురుస్తాయని తెలిపింది. అయితే, వానలు పడినంత మాత్రాన ఉష్ణోగ్రలు తగ్గవని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో క్యూమిలోనింబస్ మేఘాల వల్ల తెలంగాణలో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడతాయని, గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
Also Read: Srinivas on Kalvakuntla: కల్వకుంట్ల కంత్రీ ఏఐ తో ఫేక్ వీడియోలు.. బతుకు అంతా మోసాలే..ఆది శ్రీనివాస్
ఈ రోజు నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్ధిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మేడ్చల్, మహబూబ్ నగర్,భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
Also Read: BJP MP Etela Rajender: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్? రేపే అధికారిక ప్రకటన?
ఇక, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఒక రోజు ఎండ ఎక్కువగా ఉంటే, ఇంకో రోజు అసలు ఊహించని విధంగా జోరున వానలు పడుతున్నాయి. దీంతో, నగరంలోని రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, హైద్రాబాద్ లో కూడా ఉరుములతో కూడిన వానలు పడతాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.