Srinivas on Kalvakuntla (imagecredi:twitter)
తెలంగాణ

Srinivas on Kalvakuntla: కల్వకుంట్ల కంత్రీ ఏఐ తో ఫేక్ వీడియోలు.. బతుకు అంతా మోసాలే..ఆది శ్రీనివాస్

తెలంగాణ బ్యూ‌‌రో స్వేచ్ఛ: Srinivas on Kalvakuntla: కల్వకుంట్ల కంత్రీ ఏఐ తో ఫేక్ వీడియోలు తయారు చేసి బీఆర్ ఎస్ పైశాచిక ఆనందాన్ని పొందుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అంతా మోసాలకే పాల్పడుతుందని ఆరోపించారు.పదేళ్లు పవర్ లో ఉండి ఫోన్ ట్యాపింగ్ ద్వారా సెలబ్రేటిలు, ఆఫీసర్లు, రాజకీయ నాయకులను బెదిరించారన్నారు. ఇక జైలు నుంచి బయటకు వచ్చాక బీఆర్ఎస్ లో తన స్థానం కోసం కల్వకుంట్ల కవిత అనేక విన్యాసాలు చేస్తున్నారన్నారు.

లిక్కర్ మరకలను తుడిచి వేసుకోవడానికి ఆమె నానా పాట్లు పడుతున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు, జ్యోతిరావు పూలే విగ్రహం పేరుతో కవిత డ్రామాలు చేస్తుందన్నారు. లిక్కర్ స్కామ్ లోని నిందితులకు ఆ అర్హత లేదన్నారు. దేశంలో లిక్కర్ స్కాంపై అరెస్ట్ అయిన మొదటి మహిళ కవితే అంటూ చురకలు అంటించారు. తీహార్ జైల్ నుంచి తిరిగి వచ్చాక ఆమె మైండ్ సరిగ్గా పనిచేయడం లేదన్నారు. పూలే విగ్రహం పెట్టాలని కవిత చెప్తే స్పీకర్ వినాలా? అంటూ ప్రశ్నించారు.

Also Read: New Liquor Brands: మార్కెట్ లోకి కొత్తగా 644 బ్రాండ్లు.. మందుబాబులూ.. మీరు సిద్ధమేనా!

పదేళ్లు పవర్ లో ఉన్నప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదా? అంటూ నిలదీశారు. బీసీలకు కవితకు ఏమీ సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం శ్రమిస్తున్న పార్టీ కాంగ్రెస్ దన్నారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశామన్నారు. కానీ కవిత ఆ ధర్నాపై కూడా రాజకీయ వ్యాఖ్యలు చేస్తుందన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే, బీఆర్ ఎస్ పార్టీ లోని కీలక పదవులను బీసీలకు ఇవ్వాలని సూచించారు. కేంద్రం ఒప్పుకోకపోయినా, రాజకీయంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

అధికారం పోయాక కవిత ఇందిరాపార్క్ లో ధర్నాలు చేయడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కల్వ సుజాత ,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, భాస్కర్ తదితరులుఉన్నారు.

Also Read: Khammam Priest: ఖమ్మంలో కుల వివక్షత.. జంజం లేదంటే పూజ చేయనన్న పురోహితుడు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?