Pawan Kalyan son: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అడవి తల్లి ఓ సూచన చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ వద్దకు వచ్చిన అడవి తల్లి, బిడ్డా.. నా మాట విను అంటూ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇంతకు అసలు విషయం ఏమిటంటే..
అల్లూరి సీతారామరాజు జిల్లా డోలీ మోతలకు నిలయం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డిప్యూటీ సీఎం హోదాలో పవన్, ఒక్కొక్క గిరిజన గ్రామానికి రహదారులు అభివృద్ది పరుస్తూ, డోలీ మోతలకు ఎండ్ కార్డ్ వేస్తున్నారు. అందుకు సీఎం చంద్రబాబు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండగా, అడవిలోని అడవి బిడ్డల కష్టాలు తీరుతున్నాయని చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు పవన్ ఇదే జిల్లాలో పర్యటించి రాములమ్మ అనే వృద్ధురాలికి రహదారుల అభివృద్ధిపై హామీ ఇచ్చారు.
ఆ మాట ప్రకారం ఒక్కొక్క గ్రామానికి రహాదారి వేస్తుండగా, గిరిజనుల ఆశలు నెరవేరుతున్నాయి. ఇటీవల అల్లూరి జిల్లా పర్యటన సమయంలో ఉన్న సమయంలో ఆయన కుమారుడు మార్క్ శంకర్ కు దురదృష్టవశాత్తు గాయలైనట్లు సమాచారం అందింది. సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలైనట్లు సమాచారం తెలిసినా, పవన్ మాత్రం కురిడి గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తన పర్యటన వాయిదా వేయకుండా అలాగే సాగించారు. ఒక పాలకుడిలా తన కర్తవ్యాన్ని పవన్ పూర్తి చేశారని, బాధను దిగమింగుతూ గ్రామ ప్రజల ముందు ఆ భావాలు బయటకు రాకుండా వ్యవహరించినట్లు చెప్పవచ్చు. చిట్టచివరకు సాయంత్రం తన అన్నయ్య చిరంజీవి, వదినమ్మ కొండా సురేఖలతో కలిసి సింగపూర్ కు వెళ్లారు.
ఈ ఘటనపై పవన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమై తన కుమారుడిని పెను ప్రమాదం నుండి కాపాడినట్లు తెలిపారు. ఉదయం ప్రమాదం జరిగిందని తెలిసినా, పవన్ మాత్రం అలాగే తన పర్యటన సాగించడంపై దటీజ్ పవన్ అంటూ జనసైనికులు సోషల్ మీడియాను మోత మోగించారు. కొడుకు పరిస్థితి బాగోలేదని తెలిసినా, “ఈ రోజు కోసం” గిరిజనులు కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని ఇటు వైపు వేసిన ఆ అడుగు అంటూ అల్లూరి జిల్లా పర్యటన ఫోటోలతో వైరల్ చేస్తున్నారు.
అయితే the beatmaster అనే ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొడుకు పరిస్థితిని దిగమింగుతూ ప్రజాక్షేత్రంలో పవన్ తన మనస్సుని ధ్యానంలో ఉంచగా, అడవి తల్లి వచ్చి పలకరించి ఓదార్చినట్లుగా ఆ వీడియోను పోస్ట్ చేశారు. పవన్ వద్దకు వచ్చిన అడవి తల్లి, నీ కోపానికి విలువ ఉండాలి, కారణం ఉండాలి.
Also Read: Tirupati Pakala Katpadi: ఏపీకి గుడ్ న్యూస్.. ఆ రూట్ లో రైళ్లు రయ్.. రయ్..
నీకు ఎప్పుడు కోపం వచ్చినా, ఆలోచించు. అప్పటికీ నీ కోపం సహేతుకం అయితే, కోపాన్ని ప్రదర్శించు అంటూ భోదిస్తుంది. ఇది ఏఐ జనరేట్ వీడియో అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. పవన్ అభిమతానికి తగినట్లుగా వీడియో ఉందని, అలాగే ఆ అడవి బిడ్డల సమస్యలు తీర్చినందుకు అడవి తల్లి ఆశీర్వచనంతో పవన్ బిడ్డ క్షేమంగా ఉన్నారని జనసైనికులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా కొడుకు ఆ పరిస్థితిలో ఉన్నా, అడవి బాట పట్టిన పవన్ కు యావత్ దేశం అండగా నిలిచిందని చెప్పవచ్చు.
ఓ రోజు "అడవి మర్గాన్నా అంబులెన్స్ వచ్చింది అడవి బిడ్డ జన్మనిచ్చింది" ప్రాణ భయం లేకుండా.
ప్రకృతి, పవన్ కళ్యాణ్ ని భద్రంగా చూస్కోండి. @PawanKalyan 🛐@JanaSenaParty @JSPShatagniTeam#AdaviThalliBaata #ApDeputyCM pic.twitter.com/eCxCxFYAV6
— 𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@TheBeast_619) April 9, 2025