నర్సంపేట స్వేచ్ఛ: Donthi Madhava On BRS: బిఆర్ఎస్ పదేళ్ల దుర్మార్గ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు నిర్మించ లేదని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం లోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నర్సంపేటలోని శాంతినగర్ లోను, గురుజాలలోను, నల్లబెల్లి మండలం కొండాపూర్ లోను రూపాయలు 7.5 కోట్ల వ్యయంతో మూడు విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేశామని అన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌక ర్యం,200 యూనిట్ల వరకు ఉచిత గృహాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించామని తెలిపారు. 500 రూపా యలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు అందించామని వివరించారు. భూమి ఉన్న రైతులకు రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి 12000/- రూపాయలు అందిస్తున్నామని అన్నారు.
తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. గత పదేండ్ల బి.ఆర్.ఎస్. పాలనలో ఏ ఒక్క గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ ఇచ్చిన హామీ లు నెరవేరు స్తున్నా మన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇస్తామని తెలియజేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి రెండుసార్లు ప్రజలను మోసం చేసిందన్నారు.
Also Read: TG Summer Holidays: తెలంగాణలో ముందే సెలవులు? ఇక బడి గంటకు విరామం?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పేద ప్రజలకు ఇండ్లు మంజూరు చేయడమే కాక, నేడు ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగిందని పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో లోపం లేకుండా ఇచ్చేందుకు మూడు విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామని తెలిపారు . ఇచ్చిన మాట మేరకు ఇండ్లు ఇస్తున్న ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకి జీవి తాంతం రుణపడి ఉంటామని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తెలిపారు.
అమీనాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పండుగ వాతావరణం నెలకొన్నది. నియోజకవర్గ నాయకులు మండల నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతి నిధులు గ్రామ పార్టీ నాయ కు లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/