Swetcha Effect: మోసగాళ్ల సీజన్ వచ్చేసింది. అమాయక తులకు రైబీటీ త్రీ పత్తి అంటగడుతూ స్వేచ్ఛలో ప్రచురితమైన కథనానికి మరిపెడ మండలం ఏడిఏ విజయ్ చంద్ర, మండల అగ్రికల్చర్ అధికారి వీరా సింగ్ స్పందించారు. గుండెపూడి బుర్హాన్ పురం గ్రామాల్లో వారిరువురు సందర్శించి బీటీ త్రీ విత్తనాల వినియోగంపై కలిగే నష్టాలను రైతులకు అవగాహన కల్పించారు. ఆంధ్ర మోసగాళ్లు రైతులకు అంటగడుతున్న బిటి త్రీ విత్తనాలతో సేద్యం చేసి అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.
ఆంధ్ర కేటుగాళ్ల నుంచి బీటీ త్రీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులపై ఆరా తీశారు. ప్రజల ఆరోగ్యాలకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని సూచనలు చేశారు. మానవాళికే కాకుండా మానవాళికే కాకుండా పశుపక్షాదులకు, వాతావరణంలో సైతం పొల్యూట్ అవుతుందని వివరించారు. ప్రభుత్వ అనుమతులు లేని విత్తనాలను సేద్యం చేసి ఇబ్బందులకు గురికా వద్దని స్పష్టం చేశారు. అధిక దిగుబడి వస్తుందని మభ్యపెడుతూ బీటీ త్రీ విత్తనాలను అమ్మే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Also Read: SLBC Tunnel Update: 46వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. అగాధంలో ఆశ కోసం పోరాటం!
బీటీ త్రీ విత్తనాలు సరఫరా చేయడం గాని, విక్రయాలు జరపడం గాని, కొనుగోలు చేయడం గాని చేస్తే వారి వివరాలు వ్యవసాయ అధికారులకు గానీ పోలీసులకు గాని సమాచారం ద్వారా అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి వారికి రివార్డులను సైతం అందజేస్తామన్నారు. రైతులను అనారోగ్యాలకు గురిచేసే అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని హెచ్చరించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు