చేవెళ్ల స్వేచ్చ: Mujra Party: మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఆరుగురు మహిళలతోపాటు 13 మందిని అరెస్టు చేసారు. పార్టీ జరిగిన స్థలంలో 70 గ్రాముల గంజాయి. మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఎస్ ఓటీ పోలీసులు దాడులు జరిపారు. ఏతబర్ పల్లి శివారులోని హాలీడే ఫామ్ హౌస్ లో జన్మదిన వేడుకల పేరుతో ముజ్రా పార్టీ నిర్వహించారు. నిర్వాహకులు పార్టీ కోసం ముంబయి నుంచి యువతులను మొయినాబాద్ కు తీసుకువచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో మహారాష్ర్ట, బెంగాల్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు ఉన్నట్లు సమాచారం.
Also Read: Gandipet Illegal Constructions: అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ఎక్కడంటే!
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్ లుక్మన్ తన జన్మదినం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతులను మరో ఇద్దరు మహిళలు ఆరేంజ్ చేసినట్లు చెప్పారు. గంజాయితోపాటు లిక్కర్ బాటిల్లు, ఉక్క పాకెట్, కండోమ్ ప్యాకెట్లను, ఆరు వెహికిల్స్, 25 సెల్ ఫోన్లను స్వాధీనపర్చుకున్నట్లు వివరించారు.
అరెస్టయిన యువతులను రెస్క్యూమ్ కు తరలించగా యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/