Pawan Kalyan (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: కొడుకు ప్రమాదంపై.. పవన్ ఫస్ట్ రియాక్షన్.. వారే లేకుంటే?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawana Kalyan) చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ (Mark shankar pawanovich) అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ తాజాగా మాట్లాడారు. అరకు జిల్లా పర్యటనలో ఉండగా ఉదయం ఈ విషయం తెలిసిందని తెలిపారు. తన కుమారుడు మార్క్ శంకర్.. సమ్మర్ క్యాంప్ కోసం వెళ్లాడని పేర్కొన్నారు. తొలుత సమాచారం తెలిసినప్పుడు చిన్న ప్రమాదమని భావించానని.. అయితే ఈ ఘటనలో ఓ పసిబిడ్డ చనిపోయాడని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

అకీరా పుట్టినరోజునే విషాదం
ఇవాళ తన పెద్ద కుమారుడు అకీరా (Akiranandan) పుట్టిన రోజని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఓ కుమారుడి పుట్టిన రోజునే రెండో బిడ్డకు ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై ఇండియన్ హైకమిషనర్ తో మాట్లాడనన్న పవన్.. వారిని అక్కడికి పంపించి పరిస్థితులు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఇండియన్ ఎంబసీ సిబ్బంది చెప్పారని పవన్ అన్నారు.

బాబు ఊపితిత్తుల్లో పొగ
అగ్నిప్రమాదం కారణంగా తన కుమారుడి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిందని పవన్ తెలిపారు. అయితే ఇది దీర్ఘకాలికంగా ప్రభావం చూపించే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. చేతులకు, గాయాలైనట్లు తెలిపారు. కన్ స్ట్రక్షన్ వర్కర్స్ సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పిందని పవన్ తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ (PM Modi) ఈ ఘటనపై వెంటనే స్పందించి తనకు ఫోన్ చేశారని పవన్ అన్నారు. సింగపూర్ లోని భారత హైకమిషన్ ను కూడా అలెర్ట్ చేసినట్లు చెప్పారు. అటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), హోంమంత్రి అనితా (Vangalapudi Anitha) స్పందించినందుకు పవన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Pawan Kalyan Son Injured: పవన్‌ కుమారుడి ఆరోగ్యంపై కీలక అప్ డేట్.. స్వయంగా పంచుకున్న చిరు!

లండన్ కు పవన్..
అగ్ని ప్రమాదం కారణంగా ప్రస్తుతం తన భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) డిప్రెషన్ లో ఉన్నట్లు పవన్ తెలిపారు. మరికొద్దిసేపట్లో లండన్ కు బయలుదేరి వెళ్లనున్నట్లు తాజాగా ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. చిరంజీవితో మాట్లాడారా? అన్న ప్రశ్నకు పవన్ లేదని సమాధానం ఇచ్చారు.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?