Akhil and Sreeleela in Lenin
ఎంటర్‌టైన్మెంట్

Akhil6: మా నాయన నాకో మాట చెప్పినాడు.. అఖిల్ ఈసారి మాస్ అవతార్‌లో!

Akhil6: అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున (King Nagarjuna) తనయుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో సోషల్ మీడియాను చూస్తుంటే తెలుస్తుంది. ‘ఏజెంట్’ తర్వాత ఇంత వరకు అఖిల్ తదుపరి సినిమాపై అప్డేట్ రాలేదు. మధ్యలో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేర్లు వినిపించినా, ఏదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో అసలు అఖిల్‌కు సినిమాలు చేసే ఉద్దేశ్యం ఉందా అనేలా కూడా అనుమానాలు మొదలయ్యాయి. కాకపోతే, సినిమాలు చేయకపోయినా, ఆయన పబ్లిక్‌లో కనిపించిన తీరు, లుక్ మాత్రం.. ఈసారి చేయబోయే సినిమా మాములుగా ఉండదు అనేలా సూచనలిస్తూ వస్తున్నాయి.

Also Read- Sushma Bhupathi: చీరకట్టులో మెరిసిన సుష్మా భూపతి.. వావ్ అంటున్న నెటిజన్స్..

ఇక అఖిల్ సినిమాకు సంబంధించి ఈ మధ్య వినిపించిన ఓ దర్శకుడి పేరు, అలాగే సినిమా టైటిల్‌ ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దర్శకుడి పేరు మురళీ కిశోర్ అబ్బూరు కాగా, సినిమా పేరు ‘లెనిన్’ (Lenin Movie). ఇప్పుడా వైరల్ అయిన పేర్లతోనే అఖిల్ తదుపరి సినిమా ఉండబోతుందనేలా అధికారిక ప్రకటన వచ్చేసింది. అవును అఖిల్ హీరోగా తెరకెక్కనున్న తదుపరి చిత్రం పేరు ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మ‌క‌మైన‌ది కాదు’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌. మంగళవారం అఖిల్ అక్కినేని పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ అధికారికంగా సినిమాను ప్రకటిస్తూ.. టీజర్‌ను కూడా వదిలారు.

ఈ టీజర్‌ను చూస్తుంటే ఈసారి అఖిల్ ఎంట్రీ అరిపించే రేంజ్‌లో ఉంటుందనేది అర్థమవుతుంది. కేవలం గ్లింప్స్ అని కాకుండా ఇందులో ఓ పవర్ పుల్ డైలాగ్‌ని కూడా జోడించారు. ఈ డైలాగ్, ఈ టీజర్‌లో అఖిల్ అవతారం, విజువల్స్, థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఒక్క టీజర్‌తోనే బ్లాక్‌బస్టర్ వైబ్‌ ఏర్పడేలా చేస్తున్నాయి. ‘‘గతాన్ని తరమడానికి పోతా. మా నాయన నాకో మాట చెప్పినాడు. పుట్టెటప్పుడు ఊపిరి ఉంటాదిరా.. పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే..’’ అంటూ ఊర మాస్ అవతార్‌లో అఖిల్ లుక్ రివీలైంది.

Also Read- Ram Charan Peddi Movie: ” పెద్ది ” దెబ్బకు రికార్డులు బ్రేక్.. రిలీజ్ కు ముందే చరిత్ర సృష్టించిన రామ్ చరణ్

అఖిల్ సరసన డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సమర్పణలో మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ (Manam Entertainments), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మురళీ కిశోర్ అబ్బూరు రచనా, దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ బర్త్‌డే గ్లింప్స్ అక్కినేని ఫ్యాన్స్‌ని ఫుల్ ట్రీట్ ఇచ్చేస్తుంది. ఈసారి ఎవరు వస్తారో రండి.. బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తాం. ఇలాంటి బొమ్మ కోసం కదా ‘అయ్యగారు’ మేము చూస్తుంది అంటూ అక్కినేని అభిమానులు ఈ గ్లింప్స్‌కు కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..