devdutt padikkal
స్పోర్ట్స్

Devdutt Padikkal : చివరి టెస్టులో.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం

Devdutt Padikkal  : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లో చివరిదైన అయిదో టెస్ట్ మ్యాచ్ నేడు ప్రారంభం అయింది. ఇందులో దేవదత్ పడిక్కల్ ఆరంగేట్రం చేశాడు. తుది 11 మంది జట్టులో తనని తీసుకున్నారు. అలాగే వెటరన్ బౌలర్ అశ్విన్ కూడా 100 మ్యాచ్ ల మైలు రాయి అందుకున్నాడు. వీరితో ఇంగ్లాండ్ ప్లేయర్ బెయిర్ స్టో కూడా వందో టెస్టు ఆడారు.

ఇంగ్లాండ్ పై సాధించిన సిరీస్‌ విజయంలో టీమ్ ఇండియాలోని ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. అలాగే బౌలింగ్‌ లో బుమ్రా కీలకంగా మారి, జట్టుకి విజయాలు అందించాడు.

ఇక రాజ్‌కోట్‌లో సెంచరీతో శుభ్‌మన్ గిల్ ఫామ్‌ అందుకోవడం, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ తొలి సిరీస్‌లోనే అదరగొట్టడం, అశ్విన్‌, జడేజా అటు బంతి, ఇటు బ్యాటుతో రాణించడం, కీలక సమయాల్లో రోహిత్‌ సెంచరీ వంటి అంశాలు భారత్‌కు సిరీస్‌ను అందించాయి.

ఇప్పుడు అందరి దృష్టి కీలకమైన ఐదో టెస్టు వైపు మళ్లింది. ప్రస్తుతం టీమ్‌ ఇండియా గెలుపే లక్ష్యంగా జట్టులో కొన్ని మార్పులు చేసింది. అశ్విన్ వందో టెస్టులో అడుగు పెట్టాడు. బుమ్రా వచ్చేశాడు. అయితే బుమ్రా, సిరాజ్ లను తీసుకున్నారు. నాలుగో టెస్టులో అద్భుతంగా ఆడిన ఆకాశ్ దీప్ ను పక్కన పెట్టారు. మొత్తానికి కులదీప్ యాదవ్ ను తీసుకున్నారు.

రజత్ పటీదార్ ప్లేస్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ మరి తన ఆరంగేట్రం మ్యాచ్ లో ఎలా ఆడతాడో వేచి చూడాల్సిందే. అలాగే ఇంగ్లాండు జట్టులో వరుసగా విఫలమవుతున్న బెయిర్ స్టో కూడా వందో టెస్ట్ ఆడుతున్నాడు. తన భవిష్యత్తు కూడా ఇదే మ్యాచ్ పై ఆధారపడి ఉంది.

11మంది జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అశ్విన్, కులదీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్ ఉన్నారు.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?