Black Magic: ఈ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత మారినా.. కొన్ని మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. దెయ్యం పట్టిందని చీపురు పట్టుకుని కొట్టడం, ఎర్ర నీళ్ళు మూడు దారులు కలిసే చోట పోస్తే ఆర్ధిక సమస్యలు పోతాయని నమ్మడం చేస్తున్నారు. ఇంకొందరు ఒక్క రాత్రిలోనే ధనవంతులైపోవాలని క్షుద్ర పూజలు చేస్తుంటారు. ఈ భయపెట్టే పూజల పేరుతో సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే, ఎవరికి లాభం ఉంటుందో తెలీదు కానీ, ఈ మధ్య ఇవి బాగా ఎక్కువైపోతున్నాయి.
Also Read: Rate Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
ఈ ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఏపీలోని ప్రకాశం జిల్లా.. దోర్నాలలో క్షుద్రపూజల ఆనవాళ్లు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దోర్నాలలోని పెద్ద బ్రిడ్జి సమీప పొల్లాలో కుద్రపూజలను గుర్తించిన స్థానికులు భయంతో తమ పనులను కూడా చేసుకోలేకపోతున్నారు. నీలం రంగు బొమ్మ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు కనిపించాయని అంటున్నారు. రాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, ఎవరు చేశారో కనిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: KRMB: కృష్ణా జలాల వాటాపై సర్కార్ సీరియస్.. నేనున్నాను అంటున్న మంత్రి ఉత్తమ్..