DGP jithender: ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే దిశగా పోలీసులు కృషి చేయాలని డీజీపీ జితేంద ర్ సూచించారు. దీని కోసం అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వర్తించాలని చెప్పారు. డీజీపీ కార్యాలయంలో క్రైం రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.
నేరాలను నియంత్రించటంలో విజబుల్ పోలీసింగ్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. దీనిపై సిబ్బంది దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవాలన్నారు.
Also Read: Karate Kalyani: నోటీసులు పంపిస్తే.. తగ్గేదేలే.. హేమపై కరాటే కళ్యాణి ఫైర్!
మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వయం ఉపాధిపై మహిళలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇక, నేరాల దర్యాప్తులో క్రైం, క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్స్ ను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఎదురయ్యే ప్రతీ సవాల్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ప్రతీ పోలీస్ బాధితుల పక్షానే ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, సీఐడీ డీజీ శిఖా గోయల్ తోపాటు అదనపు డీజీలు, ఐజీలు పాల్గొన్నారు.
Also Read: Complaints on Rajini: మాజీ మంత్రి విడదల రజినీకి బిగ్ షాక్..
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు విజబుల్ పోలీసింగ్ పై ప్రజంటేషన్ ఇచ్చారు. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆయా నేరాల్లో శిక్షలు పడేలా చూడటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పారు. ఖమ్మం కమిషనర్ సునీల్ దత్, ఫోరెన్సిక్ డాక్టర్ డాక్టర్ కృపాకర్ సింగ్, ఏఎస్పీ శుభమ్, సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ లు వేర్వేరు అంశాలపై మాట్లాడారు.
కార్యక్రమంలో అదనపు డీజీలు మహేశ్ భగవత్, శ్రీనివాసరావు, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రాతోపాటు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ, యాంటీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు