Complaints on Rajini [ image credit; twitter]
గుంటూరు

Complaints on Rajini: మాజీ మంత్రి విడదల రజినీకి బిగ్ షాక్..

Complaints on Rajini: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత విడదల రజినీపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం చిలకలూరిపేటలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో పసుమర్రు రైతులు రజినీపై రెండు ఫిర్యాదులు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రజినీ మామ లక్ష్మీ నారాయణ పసుమర్రులో రోడ్డును ఆక్రమించుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు.

ఆక్రమించుకున్న స్థలానికి గోడకట్టారని, అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆ స్థలాన్ని పసుమర్తి పంచాయతీకి లక్ష్మీ నారాయణ రాసిచ్చారని వివరించారు. పంచాయతీకి రాసిచ్చిన స్థలంపై లక్ష్మీ నారాయణ కొడుకు రాము కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని రైతులు పేర్కొన్నారు.

 Also READ: Hyderabad Local Body Elections: జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్.. అందరి చూపు అటువైపే..

ఇక, పసుమర్రులో జగనన్న కాలనీ కోసం ప్రభుత్వం 200 ఎకరాలు పొలం కొనుగోలు చేసిందని, భూములు ఇచ్చిన రైతుల నుంచి లంచం తీసుకున్నారని పేర్కొన్నారు. లంచం తీసుకున్న డబ్బులో కొంతమేర తిరిగిచ్చారని, ఇంకా నలభై లక్షలు ఇవ్వాల్సి ఉందని పసుమర్రు రైతులు వాపోయారు. విడుదల రజినీ, ఆమె లక్ష్మీనారాయణ, మరిది రాము పేర్లను రైతులు ఫిర్యాదు చేర్చారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!