TG AI Engineers [image credit; swetcha reporter]
తెలంగాణ

TG AI Engineers: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లకై సర్కార్ కసరత్తు..

TG AI Engineers: రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కు హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ గురించి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ మారుతుందన్నారు.

Also READ:  Also Read: Vikramarka on HCU Issue: డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. విద్యార్థులపై ఉ.న్న కేసులను తీసివేయండి.

ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయకుండా… వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధుల బృందాన్ని కోరారు. టెక్నాలజీ, స్కిల్ డెవలెప్ మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో కాన్సూల్ వైష్ణవి వాసుదేవన్, సెక్రటరీ వివేక్ రఘు రామన్, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్(ఇండియా – సౌత్) డేనిస్ టాం తదితరులు పాల్గొన్నారు.

 Also Read: jagtial mango farmers: దళారుల దందా నిలిపివేయండి .. మా మొర ఆలకించండి.. కలెక్టర్ కు రైతుల విన్నపం

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అన్ని రంగాల్లో అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దుతామని
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్ఐసీ)లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు.

అనంతరం యూనివర్సిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులకు చిరునామాగా తెలంగాణను మార్చాలనే సంకల్పంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ యువతలో ప్రతిభకు కొదవ లేదని… మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ అందిస్తే మరింత మెరుగ్గా తయారవుతారన్నారు.

 Also Read: Eagle Squad: తెలంగాణ పోలీసుల చేతికి కొత్త అస్త్రం.. ఇక వారికి చుక్కలే..

పరిశ్రమలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కోర్సుల రూపకల్పనలో పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. కోర్సు పూర్తయ్యే నాటికి అభ్యర్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దాలన్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ విద్యా, పరిశోధన, టాస్క్, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) తదితర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, ఓఎస్డీ చమాన్ మెహతా తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్