Indiramma Houses: ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇళ్ళను అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట మండలం పర్షు నాయక్ తండా, ఖానాపురం మండలం రాగంపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్ర మంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
నర్సంపేట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట డివిజన్ లోని డివిజన్లోని 5114 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.11,50,78,490 లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు చేసినందుకు, నిర్మాణం చేసుకున్నందుకు ఎవరికి కూడా మామూలు ఇవ్వవద్దని లబ్ధిదారులను కోరారు. ఎవ్వరికి కూడా కట్నాలు కానుకలు లాంటివి కూడా ఇవ్వవద్దని కోరారు.
Also Read; Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
మీరు ఇండ్లలకు వస్తేనే మీకు కట్న కానుకలు అందిస్తారని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను నాలుగు దఫాలుగా అందిస్తారని వివరించారు. గత పదేళ్లుగా ఉన్న ప్రభుత్వం ఒక ఇంటిని కూడా ఇవ్వలేకపోయిందని అన్నారు. ప్రజలకు చెప్పింది చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని పదేళ్లుగా ప్రజలను నమ్మించిందని తెలిపారు.
అల్లుడొస్తే ఎక్కడ ఉండాలి కోళ్ళ ని బర్రెను ఎక్కడ ఉంచాలి అని చెప్పిన కేసీఆర్ ప్రజలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని అన్నారు. అలాంటి బి ఆర్ ఎస్ నాయకులు ఇప్పుడు గ్రామాల్లో ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఆరోపణలు చేస్తుండడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన ఏడాది కాలం లోనే ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి న ఘనత దక్కిందన్నారు.
Telangana RTC: ఆర్టీసీలో ఏడడుగుల బుల్లెట్.. అతడిపై సీఎం రేవంత్ ఫోకస్.. మంత్రి కీలక ఆదేశాలు!
బి ఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ మరిచిన చరిత్ర వారిదని గుర్తుంచు కోవాలని అన్నారు. హామీలను మరవడం వల్లే గత ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నా రు. ఈ విషయాలను గమ నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వరుస క్రమంలో నెరవేరుస్తు న్నదని అన్నారు.
ప్రజా ప్రభు త్వం అనేక సంక్షేమ పథకా లను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని తెలిపారు. వేల కోట్ల రూపా యలు నిధులతో సంక్షేమ పథకాలకు ఖర్చు చే స్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపె డుతున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మహిళలకు వడ్డీ లేని రుణాల కింద నిధులను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు అందిస్తున్న నిధులతో ఆర్థికంగా ఎదగాలని కోరారు. మహిళలు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో నర్సంపేట మార్కెట్ ఛైర్మెన్ పాలాయి శ్రీనివాస్, ఆర్డీవో ఉమా రాణి,తహసీల్దార్ రాజే ష్,హౌసింగ్ డీఈ విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు