Virgin Boys: యూత్ ఫుల్ కంటెంట్‌తో వచ్చే చిత్రాలకు ఈ మధ్య కాలంలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి చిత్రాలే. ఈ సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులను నవ్వుల వర్షంతో ముంచెత్తేందుకు మరో రొమాంటిక్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సిద్ధమవుతోంది. ఆ సినిమానే ‘వర్జిన్ బాయ్స్’. గీతానంద్-మిత్రా శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దరపునేని నిర్మిస్తుండగా, దయానంద్ డైరెక్ట్ చేస్తున్నారు. యువతను ఆకర్షించే కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి, మార్తాండ్ కె వెంకటేష్, వెంకట ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
Also Read- Karan Johar: షాక్.. గుర్తుపట్టలేని అవతార్‌లో కరణ్ జోహార్!
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ న్యూ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే ఇందులో ఫన్ ఎలిమెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది అర్థమవుతోంది. ఈ పోస్టర్‌ను గమనిస్తే.. ఓ అందమైన అమ్మాయి ముఖం చూపిస్తూ.. ఆమె పెదాలపై ముగ్గురు యువకులు విభిన్న శైలిలో కనిపిస్తున్నట్లుగా ఆకర్షణీయంగా ఈ పోస్టర్‌ను మేకర్స్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాపై క్రేజీ వైబ్స్ ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా యూత్‌ని టార్గెట్ చేస్తూ వస్తున్నట్లుగా పిక్చర్ అర్థమైపోతుంది.
ఇంకా ఈ పోస్టర్‌లో అమ్మాయి పెదాలపై ఒక కుర్రాడు కలర్‌ఫుల్ షార్ట్స్‌లో, మరొకరు స్కేట్‌బోర్డ్‌తో, ఇంకొకరు మ్యాగజైన్‌తో నవ్వుతూ కనిపించడం ఈ సినిమాలోని ఫన్ ఎలిమెంట్‌పై పిచ్చ క్లారిటీ ఇచ్చేస్తుంది. అన్నట్టు ఈ సినిమా ట్యాగ్‌లైన్ ఏంటో తెలుసా? ‘బ్రో.. ఆర్ యు వర్జిన్?’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ఏ తరహా చిత్రమో అర్థమైపోతుంది. కచ్చితంగా మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందనే ఫీల్‌ని ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌తోనే టీమ్ ప్రేక్షకులలోకి తీసుకెళుతోంది. ఇక టీజర్, ట్రైలర్స్ తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోవచ్చు.
Also Read- Ashwin Babu: అశ్విన్ బాబు 9వ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. మరో పవర్ ఫుల్ టైటిల్ పట్టారుగా!
ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. యువకుల మధ్య నడిచే రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా థియేటర్లలో మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి ఒక్క పోస్టర్‌తో టాలీవుడ్‌లో అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు